Tuesday, May 14, 2024

భేటీ బచావో – భేటి పడావో నిధుల దుర్వినియోగం..

తప్పక చదవండి
  • కేంద్ర ప్రభుత్వ మహిళ శిశు అభివృద్ధి శాఖ చర్యలకు ఆదేశాలు జారీ.
  • ఆడపిల్లల సొమ్ము తిన్న అధికారుల పై చర్యలు తీసుకోవాలి..
  • ప్రధాన మంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బీజేపీ నేత బేతి మహేందర్ రెడ్డి.
  • చేయని పనులు చేసినట్లు అందినకాడికి దోచిన అధికారులను
    కాపాడుతున్న మంత్రి గంగుల కమలాకర్.
  • జిల్లా సంక్షేమ అధికారి నివేదికలో దోషులుగా తేలిన అధికారులపై
    ఎందుకు చర్యలు చేపట్టలేదో కలెక్టర్ సమాధానం చెప్పాలి.

హైదరాబాద్ : ఆడ పిల్లల బంగారు భవితకై ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భేటి బచావో భేటి పడావో పథకం ప్రచారం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను అధికారులు అందినకాడికి దోచినారని బీజేపీ మాజీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయగా పి.ఎం.ఓ కార్యాలయం నుండి తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ మహిళ శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. వివరాలోకి వెళ్తే జులై 26, 2023 రోజున పి.ఎం.ఓ కార్యాలయంలో బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేయగా, ఫిర్యాదును స్వీకరించి దాని యొక్క కేసు నం: పి.ఎం.ఓ.పి.జీ/డి/2023/0156908, తేదీ: 27 జులై, 2023 రోజున కేంద్ర ప్రభుత్వ మహిళ శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేయగా ఆ శాఖ ఆగస్ట్ 10, 2023 రోజున తెలంగాణ రాష్ట్ర మహిళ, శిశు శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హొళ్ళికేరి విచారణ చేసి చర్యలు చేపట్టి ఆ నివేదికను పంపాల్సిందిగా కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రచన బొలిమేర ఆదేశాలు జారీ చేయడం జరిగిందని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. మహేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో భేటి బచావో భేటి పడావో ఆడ పిల్లలను రక్షించడానికి, చదివించడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రెండేళ్లు అనగా 2018-19, 2019-20 లకు పథకం అమలు కోసం మొత్తంగా రూ. 93.70 లక్షలు నిధులు కరీంనగర్ జిల్లాకు కేటాయించగా, ఇందులో నుండి రూ.71.14 లక్షలు నిధులు ఖర్చు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి (డి.డబ్ల్యూ.ఓ) శారద, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డి.సి.పి.ఓ) పర్వీన్ లు లెక్కల్లో చూపెట్టినారని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ లెక్కల్లో గోడల పై వాల్ పెయింటింగ్ వేయకున్న వేసినట్లు, మొబైల్ ప్రచార వ్యాన్ ప్రతి రోజు గ్రామాల్లో తిరగకున్న తిరిగినట్టు, కరపత్రాలు ముద్రించకున్న ముద్రించి పంచినట్టు, పోస్టర్లు, స్టిక్కర్లు ముద్రించకున్న ముద్రించి గోడలకు అతికేసినట్టు, కళ బృందాలు ప్రోగ్రాంలు చేయకున్నా చేసినట్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నా చేసినట్లు, ఆన్ లైన్ ప్రచారం కోసం యానిమేషన్ చిత్రాలు తీయకున్న తీసినట్లు, అలాగే వీటన్నిటి వీడియోలు, ఫోటోలు తీయకున్న తీసినట్లు డిస్ట్రిక్ట్ ప్రైస్ కమిటీ (డి.పి.సి) అనుమతులు తీసుకోకుండానే తప్పుడు లెక్కలు జిల్లా సంక్షేమ అధికారి శారద, డిస్ట్రిక్ట్ చైల్డ్ పోటెక్షన్ ఆఫీసర్ పర్వీన్ లు చూపెట్టి నిధుల దుర్వినియోగంకు పాల్పడ్డారని దీని విచారణ అధికారైన జిల్లా సంక్షేమ అధికారి వి. పద్మావతి నివేదికలో పేర్కొని దాని యొక్క లెటర్ నం: ఎ3/777/2020-21, తేది: ఫిబ్రవరి 15, 2022 రోజున కమీషనర్, రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖకు చర్యలు తీసుకొని దుర్వినియోగం చేసిన నిధులను రికవరీ చేయాల్సిందిగా కోరడం జరిగిందని, ఈ నివేదికను జిల్లా కలెక్టర్ కు డిసెంబర్ 29, 2020 రోజున సమర్పించి, తరువాత జనవరి 27, 2021 రోజున సప్లిమెంటరీ రిపోర్టును అందించడం జరిగింది. నాలుగు నెలల తర్వాత జిల్లా కలెక్టర్ ఈ ఇద్దరి అధికారులకు మే 24, 2021 రోజున షోకాజ్ నోటీసులు ఇచ్చి అందులో ఏడు రోజుల వ్యవధిలో సమాధానం ఇవ్వాలని పేర్కొనడం జరిగిందని మహేందర్ రెడ్డి తెలిపారు. ఆడపిల్లల సొమ్ము తిని చేయని పనులు చేసినట్లు అందినకాడికి దోచిన అధికారులను జిల్లా మంత్రి గంగుల కమలాకర్ అండదండలతో వారి పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడుతున్నారని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా పి.ఎం.ఓ కు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ ఆదేశాలను పరిగణలోకి తీసుకొని భేటి బచావో భేటి పడావో నిధుల దుర్వినియోగంకు పాల్పడి ఆడపిల్లల సొమ్ము కాజేసిన “నివేదికలో పేర్కొన్న అధికారుల” పై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా ఆదేశించి వారిని వెంటనే విధుల నుండి తొలగించాలని రాష్ట్ర, మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిని బీజేపీ మాజీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జమాల్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుమన్, కామరపు నరహరి, కట్ట సాయి, నవీన్, శ్రీనివాస్, అనిల్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు