Saturday, July 27, 2024

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను మంత్రివర్గం నుండి తొలగించాలి..

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్..
    హైదరాబాద్: గిరిజన ప్రజా ప్రతినిధి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ పై భౌతిక దాడికి పాల్పడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంత్రివర్గం నుండి తొలగించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ డిమాండ్ చేశారు.. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్, గిరిజన నాయకుడు, ప్రజాప్రతినిధి జాదవ్ రాజేష్ బాబుని శనివారం రోజు కేటీఆర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా తన ముందు నడుస్తున్నాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెనుకనుండి కొట్టి, మళ్ళీ ముందుకు వచ్చి చెంప మీద కొట్టి అవమానించడం జరిగిందని.. దీనికి నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా గిరిజన శక్తి ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.. ఉన్నత స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలో, ప్రజా సేవకొరకు వచ్చిన గిరిపుత్రునికి కావాలనే అవమానించడం జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ 24 గంటల్లో జాదవ్ రాజేష్ బాబుకు క్షమాపణ చెప్పకపోతే తగిన మూల్యం చేల్లించుకోవాల్సిందే గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షులు నవీన్ నాయక్, ఓయూ అధ్యక్షులు హనుమంతు నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి సుధాకర్ నాయక్, ఓయూ ప్రధాన కార్యదర్శి సతీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు