Tuesday, June 18, 2024

కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమూహ సమర దీక్ష..

తప్పక చదవండి

హైదరాబాద్: తెలంగాణలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాలలోని 1445 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆదివారం రోజు హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద టెంటు వేసి సమూహ సమర దీక్షకు పూనుకున్నారు. ఈ సమర దీక్షను ఎమ్మెల్సీ అడుగుపల్లి నరసింహారెడ్డి పూలదండలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని సమర దీక్షకు సంఘీభావం తెలిపి, ప్రభుత్వాన్ని కాంట్రాక్టు విశ్వవిద్యాలయ అధ్యాపకులకు వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఈ సమరదీక్ష ఉద్దేశమైనటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులరైజేషన్ చేయవలసిందిగా ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, యూనివర్సిటీ అధ్యాపకులు గత 20 ఏళ్ల నుంచి యూనివర్సిటీలో సేవ చేస్తూ, అధికమైనటువంటి విద్యా అర్హతలు కలిగి యుండి యూనివర్సిటీ ఉన్నతికి కృషి చేశారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ విషయంపై అధిష్టానంతో మాట్లాడానికి నేను ముందుంటానని యూనివర్సిటీ అధ్యాపకులకు హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ తెలంగాణ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వేల్పుల కుమార్ తాళ్ళపల్లి వెంకటేష్, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమూహ సమర దీక్ష ఆధ్వరంలో జరిగింది.. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి వెంకటేశ్, డాక్టర్ చిర రాజు డా. ఈ. ఉపెందర్ రావు, ఓయూ జాక్ చైర్మన్ ల నాయకత్వంలో అన్ని యూనివర్సిటీల అధ్యాపకులు వందల మంది పాల్గొని దీక్షను కొనసాగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఓ. కృష్ణయ్య, డా. విజయేందర్, డా. భవాని సత్యం, సి.హెచ్ వెంకటేష్, సుదర్శన్, డా. వెంకట గోపినాథ్, డాక్టర్ మంథర్ శంకర్, డాక్టర్ టి. రాధిక, డాక్టర్. ఏ.లక్ష్మి, డాక్టర్ మచ్చ రమేష్, బి. రాజు, డాక్టర్ కే. యాదగిరి, డాక్టర్ రాజేష్ కన్నా, డాక్టర్ బి. మాధవి, డాక్టర్ మహేందర్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ మధు, డాక్టర్ ఏ. సాంబశివరావు, డాక్టర్ బి. శంకర్, ఎస్. కుమార్, డాక్టర్ వై. శ్రీనివాస్ రెడ్డి, కె. అమరేందర్, బచ్చన ఉపేందర్ రావ్, బాసర ఐఐటి గుడ్జర్ శంకర్, మొదలగు 400 మంది పాల్గొన్నారు.. యూనివర్సిటీల అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని దీక్షను కొనసాగించారు. ఇందులో డాక్టర్ సుదర్శన్, జాక్ కో కన్వీనర్ డా. వెంకట గోపినాథ్, డాక్టర్ మంథర్ శంకర్, డాక్టర్ టి.రాధిక, డాక్టర్. ఏ. లక్ష్మి, డాక్టర్ మచ్చ రమేష్, బి. రాజు, డాక్టర్ కే. యాదగిరి, డాక్టర్ రాజీవ్ కన్నా, డాక్టర్ బి. మాధవి, డాక్టర్ మహేందర్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ మధు, డాక్టర్ ఏ. సాంబశివరావు, డాక్టర్ బి. శంకర్, ఎస్. కుమార్, డాక్టర్ వై. శ్రీనివాస్ రెడ్డి, కె. అమరేందర్, బచ్చన ఉపేందర్ రావ్, గుడ్జర్ శంకర్ మొదలగు 600 మంది పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు