- పంచాయతీ కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన తీన్మార్ మల్లన్న..
- మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి సఫాయి కార్మికుడికి ఉచితంగా ఆరోగ్య భీమా చేపిస్తా..
- అవినీతి ప్రజాప్రతినిధులకు రైటు రీ కాల్ సింహస్వప్నం..
శామీర్‌పేట : ప్రజల సోమ్ము దోచుకుంటున్న మంత్రి మల్లారెడ్డి మైలపోలు తీస్తానని, వచ్చే ఎన్నికల్లో ప్రజల సొమ్మును ప్రజల వద్దకే వచ్చేలా మంత్రి మల్లారెడ్డితో ఖర్చు పెట్టించి మరీ ఓడిస్తానని తీన్మార్ మల్లన్న అన్నారు. శుక్రవారం శామీర్‌పేట మండలం, అలియాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని, సంగీత్ ఫంక్షన్ హాలులో పంచాయతీ కార్మికులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు చాలా మంది తమ న్యాయమైన హక్కుల కోసం సమ్మె చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఎమ్మెల్యేకు ఎంత జీతముంటుదో.. పంచాయతీల పరిధిలో పని చేసే ఎమ్మెల్యేలకు కూడా అంతే జీతముంటుందన్నారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సఫాయి కార్మికుల శ్రమను గుర్తించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అంతే కాకుండా సఫాయి కార్మికుల పిల్లలకు విధ్య, ఉద్యోగాల్లో అదనపు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. పంచాయతీ కార్మికులు పనిచేయకుండా ఇట్టే తెలిసిపోతుందని, పంచాయతీ కార్మికులు నాలుగు రోజులు సమ్మెలో ఉంటే గ్రామాలు అపరిశుభ్రంగా ధర్శనమిస్తున్నాయన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి సఫాయి కార్మికుడికి ఉచితంగా ఆరోగ్య భీమా చేయిస్తానని హామి ఇచ్చారు. కార్మికుల బిడ్డల చదువు, మీ ఆరోగ్యం కోసం ఆలోచన చేస్తున్నానన్నారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని విముక్తి చేసి ఇక్కడ చదువు, ఆరోగ్యం, ప్రజలు ఆనందంగా బ్రతికే రోజులు తీసుకురావడం కోసమే నియోజకవర్గానికి వచ్చినట్లు ఆయన వివరించారు. నీ కొడుక్కి ఉద్యోగం వస్తే నువ్వే దానం చేసే స్థాయికి వస్తావన్నారు. పంచాయతీ సఫాయి కార్మికులకు కలెక్టర్ స్థాయి గుర్తింపు దక్కాలన్నారు.
భారతదేశంలోనే మల్లారెడ్డి అంత అవినీతి పరుడైన మంత్రి లేడన్నారు. మల్లారెడ్డి అన్నం తినడని ఎక్కడ కాళీ భూములు కనిపిస్తే అవ్వే తింటాడని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న రాజకీయం చేయాలనుకుంటే నా స్టుడియో నుంచే చేస్తా ఇక్కడి రావాల్సిన అవసరం లేదన్నారు. మంత్రి మల్లారెడ్డి నెలకు రూ.4లక్షల 20 వేల జీతం తీసుకుంటున్నారని, నాలుగున్నరేళ్లుగా లేనిది నిన్న, ఇయ్యాల మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, పోచమ్మ గుళ్ళు, ఎల్లమ్మ గుళ్ళు కట్టిస్తానని బాగా తిరుగుతున్నాడని, మంత్రి మల్లారెడ్డిని నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తిప్పి ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును ఖర్చుపెట్టిస్తానన్నారు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒకటి రెండు సార్లు నియోజకవర్గంలోకి వస్తేనే గ్రామాల్లో చక్కర్లు కొడుతున్నారని, నేను పూర్తిగా నియోగవర్గంలో తిరిగి ప్రజలకు మంత్రి మల్లారెడ్డి దగ్గర నుంచి రూ.5 వందల కోట్లు ఖర్చుపెట్టి ఇప్పిస్తానన్నారు. మల్లారెడ్డి మీ వద్దకు వస్తే మీ సమస్యలు పరిష్కరించుకోని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని కోరారు. ఎదైనా వస్తువు కొన్నప్పుడు అది సక్రమంగా లేకుంటే ఎలాగైతే తిరిగి ఇచ్చి మల్లి కొత్త వస్తువు తెచ్చుకుంటామో అదే విధంగా ఓటు వేసిన నాయకుడు ప్రజల కోసం సక్రమంగా పనిచేయకుండా మనం వేసిన ఓటు మల్లి తిరిగి తీసుకోవటం అంటే రైటు రీ కాల్ అవకాశం ప్రజలకు ఉండాలన్నారు. ఎన్నికల వేల నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే రైట్ టు రీ కాల్‌తో నాయకులకు తగిని గుణపాఠం చెప్పేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వ్రాత పుస్తకాలు ఇస్తే మంత్రి మల్లారెడ్డి ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. మీదికెల్లి కామిడి చేసి వెనుకాల నుంచి సీరియస్‌గా దోపిడి చేస్తాడని ఆరోపించారు. ఎంతో మంది ఎన్నో ఏళ్లుగా పాలమ్మి, పూలమ్మి బ్రతుకుతున్నారు వారందరూ ఎందుకు కోటీశ్వరులు కాలేదన్నాని మల్లారెడ్డిని ప్రశ్నించారు. మల్లారెడ్డి ప్రమాణం చేయమంటే తీన్మార్ మల్లన్న మీద ప్రమాణం చేయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను సర్శనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏ పని చేస్తే మంత్రి మల్లారెడ్డి అదే పని చేస్తుండని, నియోజకవర్గంలోని ప్రజలకు నా ఆస్తులన్నీ రాసిస్తా.. నీ ఆస్తులను ప్రజలకు పంచడానికి సిద్దంగా ఉన్నావా అంటూ సవాల్ విసిరారు. అలియాబాద్ చౌరస్తా వద్ద ఉన్న పిస్తా కబ్జానేనని ఆరోపించారు. సఫాయి కార్మికులకు ఏ కష్టమోచ్చినా మీకు అండగా ఉంటానన్నారు.
తప్పక చదవండి
-Advertisement-