Tuesday, May 14, 2024

సమావేశాలు మూడురోజులే

తప్పక చదవండి
  • బీఏసీకి మజ్లిస్‌ నుండి అక్బరుద్దీన్‌ ఓవైసీ హాజరు
  • కాంగ్రెస్‌ నుండి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
  • బీజేపీ ఎమ్మెల్యేలకు అందని పిలుపు..
  • 20 రోజులు నిర్వహించాలని కోరిన మల్లు
  • ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • కంటోన్‌మ్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళి
  • సాయన్నతో అనుబంధాన్ని పంచుకున్న కేసీఆర్‌
  • 2 ని॥ల మౌనం తరవాత సభ నేటికి వాయిదా
    హైదరాబాద్‌ : అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడిరచింది. శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధికార పార్టీ నుండి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, పలువురు మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ నుండి మల్లు భట్టి విక్రమార్క, మజ్లిస్‌ పార్టీ నుండి ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడిరచాయి. మూడ్రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకున్న చర్యలపై చర్చిస్తామని వెల్లడిరచింది. అయితే, ఈ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్‌ కోరింది. కాగా, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం దివంగత కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు అసెంబ్లీ నివాళులర్పించింది. సభలో సీఎం కేసీఆర్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో సాయన్న పని
    చేశారన్నారు. ఆయన వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందన్నారు. ఎటువంటి సందర్భంలోనైనా చిరునవ్వుతో చాలా ఓపికతో ఉండేవారని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారన్నారు. సాయన్న కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాను ముఖ్యమంత్రిని అయ్యాక.. అనేక సందర్భాల్లో ఏదైనా ప్రయత్నం చేసి హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను కలిపేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. కంటోన్మెంట్‌ ప్రజలకు చాలా తపనపడేవారన్నారు. అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి కంటోన్మెంట్లను నగరపాలికల్లో కలపాలని ఆలోచిస్తుందన్న శుభవార్త అందింది. ఆ రకంగానైనా సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానన్నారు. సాయన్న నిజామాబాద్‌ జిల్లాలో జన్మించారని, హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో సెటిలై.. వ్యాపారవేత్తగా ఉన్నారన్నారు. ఆయన వివాదరహిత నేతల్లో ఆయన ఒకరని, ఆయన కూతురు సైతం నగరంలో కార్పొరేటర్‌గా సేవలందించిందన్నారు. సాయన్న కుటుంబం తమ కుటుంబంలాంటిదన్నారు. ఆయన లేని లోటు తీరనిదని, కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యేతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తరవాత ఎంఐఎం, కాంగ్రెస్‌, ఇతర సభ్యులు సాయన్నతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేశారు. మంత్రి వేముల ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్‌లో జన్మించిన సాయన్న హైదరాబాద్‌లో సెటిలయ్యారని, రాజకీయంగా పరిణతి చెందిన నేతగా ఎదిగారని అన్నారు. తనతండ్రితో సాయన్నకు మంచి పరిచయం ఉందన్నారు. ఏ పననైనా చిటికెలో చేసేవారని గుర్తు చేశారు. మల్లు భట్టి విక్రమార్క, దానం నాగేందర్‌ తదితర సభ్యులు కూడా సాయన్న మృతిపట్ల సంతాపం తెలుపుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకున్నారు. సాయన్న మృతికి శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడిరది. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందనరావు, గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజసింగ్‌ హాజరయ్యారు. ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూఢంచల భద్రత ఏర్పాటు చేశారు. ధర్నాలు రాస్తారోకోలు, నిరసనలపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లాంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు మెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు కావడంతో పలు పార్టీ నేతలు అసెంబ్లీ ముట్టడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 1000 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రూప్‌ ` 2 అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ పరిసరప్రాంతాల్లో లా అండ్‌ ఆర్డర్‌, టాస్క్‌ ఫోర్స్‌, ఇంటిలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, పోలీసులు బందోబస్త్‌ ఏర్పాటు చేశారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు