- ప్రభుత్వానికి కలిసొచ్చిన వేలంపాట..!
- రూ.100 కోట్లు దాటిన ఎకరా భూమి ధర
- అత్యల్పంగా ఎకరం రూ.51 కోట్లు పలికిన రేటు
- నాలుగు ప్లాట్లకే రూ.1,532.50 కోట్ల ఆదాయం
- సగటున గజం భూమి రూ.1.5 లక్షలు పలికిన ధర
- నిధుల కోసమే హెచ్‌ఎండీఏ భూముల విక్రయం
హైదరాబాద్ : కోకాపేట నియో పోలిస్ రెండో విడత భూముల వేలం తెలంగాణ సర్కార్‌కు కాసుల పంట పండిరచింది. గురువారం కోకాపేటలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట భూముల వేలం కొనసాగింది. 6, 7, 8, 9 ప్లాట్లకు సంబంధిం వేలం జరుగుతోంది. 45.33 ఎకరాల్లోని ఏడు ప్లాట్లను హెచ్‌ఎండీ వేలం వేస్తోంది. ప్లాటు కనీస విస్తీర్ణం 3.9 ఎకరాల నుంచి 9.1 ఎకరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించిన ఈ వేలంలో ఆన్‌లైన్‌లో కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఒక ఎకరానికి కనీస ధర రూ.35 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. గతంలో కోకాపేటలో 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రెండువేల కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు కనిష్టంగా ఎకరా రూ.31 కోట్ల నుంచి అత్యధికంగా రూ.60 కోట్ల రూపాయల ధర పలికింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువే పలికి ఏకంగా ఎకరం ధర రూ.70 కోట్ల వరకూ వేలంలో దూసుకెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఆదాయాన్ని మరోసారి ఆర్జించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రెండువేల నుండి రూ.2500 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరుతుందని హెచ్‌ఎండిఏ ఆశిస్తోంది. కోకాపెట నియో పోలిస్ భూములల్లో మల్టీపర్పస్ నిర్మాణాలు చేసుకోవడానికి అవకాశం ఉండడంతో భారీగా డిమాండ్ పెరిగింది. ఆఫీస్, రెసిడెన్షియల్ స్పేస్‌కు ఉపయోగించుకునే అవకాశం ఉంది. భారీ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వనుంది. ఫైనాన్షియల్ డిస్టిక్ట్ ఎయిర్పోర్ట్‌కు, సిటీకి అత్యంత దగ్గరలో ఉన్న భారీ లేఅవుట్ కోకాపేట నియో పోలిస్ లేఅవుట్.. దీంతో డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో కోకాపేట నియో పోలిస్ ఫేజ్2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడిరది. నియో పోలిస్ భూములు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. ఎకరం భూమికి కనీస ధర రూ. 35 కోట్లుగా హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. వేలంలో మాత్రం అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 72 కోట్లు, అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికింది. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీ పడ్డాయి. నియో పోలిస్ ఫేజ్
2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. తాజాగా నిర్వహించిన వేలంతో.. ఇప్పటి వరకు కోకాపేట నియో పోలిస్‌లో 26.86 ఎకరాలకు వేలం పూర్తయింది. సాయంత్రం నుంచి 10, 11, 14 నెంబరు ప్లాట్ల వేలం జరిగింది. ఈ మూడు ప్లాట్ల విస్తీర్ణం 18.47 ఎకరాలు. వీటిలో 10వ నెంబరు ప్లాటు చారిత్రాత్మక ధర పలికి.. ఎకరం రూ.100.75 కోట్ల ధర పలికింది. 3.6 ఎకరాల్లో ఈ పదో నెంబరు ప్లాటు ఉంది. ఈ ఒక్క పదో నెంబరు ప్లాటు వల్లనే రూ.360 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
హెచ్‌ఎండీఏ పెట్టిన ఖర్చు రూ.300 కోట్లు
కోకాపేటలో అభివృద్ధి చేసిన లే అవుట్ కోసం హెచ్‌ఎండీఏ సుమారు రూ. 300 కోట్ల రూపాయలను వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నది. సుమారు 41 ఎకరాలను రకరకాల వసతుల కోసమే కేటాయించారు. లేఅవుట్‌లోని రోడ్లన్నీ 45 మీటర్ల వెడల్పుతో 8 లేన్ల రహదారి, 36 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తంగా ఈ విడతలో కోకాపేటలోని 45 ఎకరాలను అమ్మకానికి ఏర్పాట్లు చేసింది. రెండు సెషన్ లుగా భూములు వేలం జరుగుతోంది. సర్కార్ ఎకరాకు 35 కోట్లుగా ధర నిర్ధారించింది కోకాపేటలో అభివృద్ధి చేసిన లే అవుట్ కోసం హెచ్‌ఎండీఏ సుమారు రూ. 300 కోట్ల రూపాయలను వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నది. సుమారు 41 ఎకరాలను రకరకాల వసతుల కోసమే కేటాయించారు. లేఅవుట్‌లోని రోడ్లన్నీ 45 మీటర్ల వెడల్పుతో 8 లేన్ల రహదారి, 36 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ 45.33 ఎకరాల భూమి అమ్మకంతో భారీగా ఆదాయం రానుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధిచేసిన కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌లో ప్లాట్లు కొంత కాలంగా వేలం వస్తున్నారు. 2021లో మొదటి ఆన్‌లైన్ వేలం నిర్వహించారు. మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను వేలం వేశారు. అప్పట్లో ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకున్నారు.
ఇందులో ఎకరానికి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలకగా, గరిష్ఠ ధర రూ.60.2 కోట్లు పలికింది. మొత్తం వేలం ప్రక్రియలో సరాసరిగా ఎకరం రూ.40.05 కోట్లు పలికింది. 2/పీ వెస్ట్ పార్ట్ గల ప్లాట్‌ను రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతంచేసుకున్నది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.2000.37 కోట్ల ఆదాయం సమకూరింది. కోకాపేటలో ఇప్పటికే 58 అంతస్తుల వరకు వ్యాపార, వాణిజ్య, నివాస భవనాలు నిర్మాణంలో ఉన్నాయి.
తాజాగా హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్‌లోనూ అదే స్థాయిలో హై రైజ్ అపార్ట్‌మెంట్లు నిర్మించడానికి అవకాశం ఉండటంతో బిడ్డర్లు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఔటర్ రింగురోడ్డును అనుకొని ఉండటంతోపాటు పక్కనే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఉండటం వల్ల ఈ భూములకు ప్రాధాన్యం పెరిగింది. నియోపోలిస్ లే అవుట్‌లోని 8 ప్లాట్లను ఒకే రోజు ఆన్‌లైన్ వేలం విక్రయించారు.
తప్పక చదవండి
-Advertisement-