Friday, May 3, 2024

సోహెల్ నటించిన మ్యాసియస్ట్ టైటిల్ ట్రాక్ ‘రింగు రింగు బిళ్ళ’ పాట విడుదల

తప్పక చదవండి

‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్ బస్టర్ ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రం కోసం చార్ట్ బస్టర్ ఆల్బమ్ ను కంపోజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన రాజు నా బాలరాజ, తాగుదాం తాగి ఆగుదాం పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టైటిల్ సాంగ్ ‘రింగు రింగు బిళ్ళ’ ను విడుదల చేశారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో రింగు బిళ్ళ పాట కోసం మాస్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నెంబర్ ని కంపోజ్ చేశారు.

- Advertisement -

భోలే షావలి, రఘురాం ఈ పాటని అద్భుతంగా అలపించారు. దేవ్ పవార్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఆస్కార్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు అందించిన కొరియోగ్రఫీ మరో ఆకర్షణగా నిలిచింది. సోహెల్ చేసిన మాస్ డ్యాన్స్ మూమెంట్స్ గ్రేస్ ఫుల్ అండ్ ఫెంటాస్టిక్ గా వున్నాయి. డైనమిక్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు సోహెల్.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు