Saturday, March 2, 2024

మాల ధారణం… నియమాల తోరణం

తప్పక చదవండి

మంచు కురిసే శీతాకాలం ప్రారంభమయిందంటే స్వామియే శరణం అయ్యప్పా అని భక్తాగ్రేస రుల భజనలు పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రతిధ్వనిస్తాయి. గతంలో పట్టణాలకు మాత్రమే పరిమిత మైన ఈ దీక్షలు, నేడు మారుమూల గ్రామాలకు సైతం విస్తరించి, భక్తజనం నానాటికీ పెరుగుతు న్నది. కార్తీక మాసం ప్రారంభం నుండి వివిధ సమయాలలో ఆచరించే అయ్యప్ప స్వామి దీక్షలు భక్తి శ్రద్ధలకు, పవిత్రతకు, నియమాలకు ప్రతీకలు. అయ్యప్ప అవతారము.. ప్రతి యుగంలోనూ ధర్మసంస్థాపనార్ధం శ్రీమహా విష్ణువు అవతారాలెత్తుతూ సనాతన ధర్మాన్ని సంరక్షిస్తాడు. కాని దత్తాత్రేయుడు భక్తజనోద్దరణ కొరకు శాశ్వత అవతార పురుషుడుగా భూమి యందు అవతారాలు ఎత్తుతూ ‘చతుర్యుగ అవ తార మూర్తి’గా ఖ్యాతినొందాడు. త్రిమూర్తుల అంశాలుగా జన్మించిన దత్తాత్రేయుని అవతారాల్లో ఒకటి అయ్యప్పస్వామి, మోహిని రూపంలో ఉన్న హరికి, శివునికీ కలిగిన పుత్రుడైనందున ‘హరిహర సుతుడని’ ధర్మశాస్త్రా, భూతనాధుడు, అయ్యప్ప అని కీర్తించ బడుతున్నాడు. మహావిష్ణువుచే మణి హారమును మెడలో వేయబడి నందున ‘మణికంఠుడని’ సార్ధక నామధేయుడైనాడు. పాండ్య దేశ రాజైన రాజశేఖరుడు, మహారాణి పేరిందేవి, ప్రేమతో అయ్య, అప్ప’ అని పిలిచినందున ‘అయ్యప్ప’గా పిలువబడు తున్నాడు. రాజశేఖర మహారాజు, అగస్త్య మహాముని’ ఆదేశానుసారం ‘ఎరుమేలి వద్ద ధర్మశాస్తా దేవాలయంను నిర్మించెను. శబరి తపస్సు చేసిన స్థలంలో విశ్వకర్మ అయ్యప్ప దేవాల యమును, ఎడమ వైపు మాలికాపురత్తమ్మ ఆలయాన్ని, అయ్యప్ప ఆలయానికి తూర్పున 18 మెట్లు, వాటికిరువైపుల కరుప్ప, కడుత్త దేవాలయాలు నిర్మించెను. పవిత్రమైన మకర సంక్రాంతి రోజు శనివారం కృష్ణ పంచమి, ఉత్తరా నక్షత్రాన పరుశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించెను.
మాల ధారణం.. 18సార్లు శబరిమల పదునెట్టాంబడిని అధిరోహించి, దైవ సాక్షాత్కారం కలిగిన గురుస్వామి మంత్రోచ్ఛారణలతో మాలధారణ చేస్తాడు. దీక్షా నియమాలు త్రికరణ శుద్ధిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయిస్తాడు. ఏకాగ్రతతో అత్మ సాక్షాత్కారార్ధమై పాపములు తొలుగుటకు, లౌకిక విషయాలపై వ్యామోహం తగ్గుటకు, కోపతాపాలు ఉపశమించేందుకు ఉదయం, సాయంత్రం 108 సార్లు శరణు ఘోష చేస్తూ, 41 రోజులకు తక్కువ కాకుండా దేవుడిని పూజిస్తూ సాధన చేయడం సాంప్రదాయం. నల్ల దుస్తులు ధరించుట, నుదుటిపై విభూతి చందన, కుంకుమలు ధరించుట, తులసి, రుద్రాక్ష మాల ధారణం, బ్రహ్మచర్యం, సాత్వికాహారం, భజన, అన్నదానం, పవిత్ర స్నానాలు, వైరాగ్య సంకే తాలైన గడ్డం, గోళ్లు పెంచుట దీక్షలో ప్రధానాంశాలు. కొబ్బరికాయ మూడు కన్నులలో ఒక కన్నుకు రంధ్రం చేసి, నీటిని తొలిగించి పరిశుద్ధ మైన నెయ్యితో నింపి, ఇరుముడిలో ఒక ముడిలో కడుతూ, రెండవ ముడిలో యాత్రకు కావలిసిన ఆహార పదార్థాలు కడతారు. ఇరుముడిని తలపైకి ఎత్తుకున్నాక వెనక్కు తిరిగి చూడక బయలుదేరు తారు. ప్రయాణంలో ఎరుమేలి, కాళికట్టి, అశుదా నది, కలిడంకుండ్రం, కరిమల, పంపానది, నీలి మలై, శరంగుత్తియాల్‌, శబరిపీఠం, సన్నిదానం చేరుకుంటారు. 41రోజులకు తక్కువ గాకుండా గురుస్వామి ద్వారా 108 పూసలు గల తులసి లేదా రుద్రాక్ష మాలధారణ, ఉదయం, సాయంత్రం చన్నీటి స్నానం విభూతి, చందనం, కుంకుమ ధరించి 108 సార్లు అయ్యప్ప శరణు ఘోష పలకడం, కర్పూర హారతి, ఫలాదిక సమర్పణం దుస్తులు ధరించడం, రోజుకొక్క సారైన దేవాలయ సందర్శనం చేస్తారు. ఇవే కాకుండా పాదరక్షలు తొడగక పోవడం, ధూమపానం మత్తు పదార్థాలు, తాంబూలం, మాంసాహార నిషేధం, ఒక్కసారి భోజనం, అల్పాహారం, క్షవరం, గోళ్ళు తీయడం నిషేధం. మంచంపైగాక చాపపై మాత్రమే నిద్రించడం, పగలు నిద్రించక పోవడం, దీక్షాకాలంలో బ్రహ్మచర్యం పాటించడం, వినోద కార్యక్రమాలు చూడక పోవడం, స్నానం చేసే వరకు మంచినీరు త్రాగక పోవడం, కుల మత ధనిక పేద భేదం లేక అయ్యప్పలకు నమస్కారం చేయడం, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, సత్సంగం, విధిగా భజనలో పాల్గొనడం, కనీసం మూడు సార్లయినా ఇతరుల యింటికి భిక్షకు వెళ్ళడం, అన్న దానం చేయడం అయ్యప్ప దీక్షా సమయంలో విధిగా పాటించాల్సిన నియమాలు. మొదటిసారి దీక్షను తీసుకున్న కన్నెస్వాములు మకర సంక్రాంతి సమయంలో కనిపించే మకర జ్యోతిని సందర్శించు కుంటారు. చాలా వరకు స్వయంపాకాన్నే భుజిస్తూ ఒకపూట భోజనం, ఒకపూట అల్పాహారం మితంగా భుజిస్తూ, దీక్షను స్వీకరించేవారు దైవభక్తి, ఆత్మ సంయమనంతో పాటు, ఆరోగ్యవంతులుగా ఉండ గలరనేది నిర్వివాదాంశం.
` రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు