తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి
హైదరాబాద్ : యూపీఎస్సీ సివిల్స్ ర్యాంకులు సాధించిన అభ్యర్ధులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి అభినందనలు తెలియజేశారు. సివిల్స్ ర్యాంకును సాధించే క్రమంలో ఎన్నో వైఫల్యాలను వారు అధగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు . యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 50 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. టాప్ ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు అభ్యర్ధులు ఉండటం గమనార్హం .. విద్యార్థులు క్రమశిక్షణ కూడిన ఏకాగ్రతతో చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారనడానికి ఇదొక చక్కని ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు.