Saturday, April 27, 2024

బాలికల భవితకు బంగారు బాట వేద్దాం

తప్పక చదవండి

సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలు వివక్ష పై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24’ 2008 నుండి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ గర్ల్స్‌ డెవలప్మెంట్‌ మిషన్‌ కేంద్ర ప్రభుత్వం ‘మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖఆధ్వర్యంలోనిర్వహిస్తారు. ‘‘బాలికా దినోత్సవ సందర్భంగా’’ బాలికల సాధికారిత సమాజంలో బాలికల సంరక్షణ హక్కులు ఆరోగ్యం ‘విద్య ‘భద్రత సామాజిక ఎదుగుదల బాలికలకు ‘బాలురతో సమానహక్కులు’ సమాన అవకాశాలు స్వేచ్ఛ బాలికను గౌరవించడం అన్ని రంగాలలో బాలురతో సమానంగా అవకాశాలు ఇవ్వడం బాలికల పట్ల వివక్షతను తొలగించడం సాంఘిక ‘ఆర్థిక సమానత్వ కల్పన ‘జెండర్‌ సమానత్వం సామాజిక భద్రత మొదలగు అంశాల మీద అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపపట్టడం జరుగుతుంది. ఆడపిల్లనే అనే సంస్కృతి.. ఆడపిల్ల అంటే ‘‘ఆడపిల్లనే’’ అనే సంస్కృతి సమాజంలొ నెలకొనడం బాలికల పాలిట శాపంగా పరిణమించింది. తల్లి గర్భంలో పెరుగుతున్నది ఆడ శిశువు అని తెలియగానే ‘‘భ్రూణ హత్యలకు’’ పాల్పడటం సర్వసాధారణ మైంది. ఆడపిల్లలు అన్ని రంగాల్లో నిర్లక్ష్యం.. కుటుంబం నుండే ఆడపిల్ల నిర్లక్ష్యం పెంపకంలొ వివక్షతకు గురికావడం విచారకరం. కుటుంబం నుండి మొదలైన వివక్షత నిర్లక్ష్యం చిన్న చూపు అన్ని రంగాలలో నెలకొనడం వల్ల బాలికల అభివృద్ధికి వారి సాంస్కృతిక ‘సాంఫీుక ‘ ఆర్థిక ‘సామాజిక వికాసానికి గొడ్డలిపెట్టుగాపరిణమించింది . సమస్యల విషవలయంలో చిక్కుకు పోయిన ఆడపిల్లల అభివృద్ధి సంక్షేమం ఆశించిన మేరకు జరుగలేదు. ఆడ పిల్లలను కించపరచడం సామాజిక రుగ్మతైంది. చట్టాలు విఫలం.. బాలికలకు విద్య వైద్యం ఆహారం చట్టబద్దమైన హక్కు ఆరోగ్య సంరక్షణ సామాజిక భద్రత బాల్యవివాహాలు నుండి బాలికలకు విముక్తి కల్పించాలని ప్రవేశపెట్టిన అనేక చట్టాలు పథకాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. సమస్యలే ఆడపిల్లల ఆస్తులుగా అవమానాలు నిర్లక్ష్యం అనారోగ్యం వేతన వివక్ష వారికి ఆభరణాలుగా పరిణమించాయి.
రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వం 2015లో చేపట్టిన ‘‘ ‘‘భేటీ బచావో బేటి పడావో’ అనే పథకం ఆడపిల్లల అభివృద్ధికి వారి సాంఘిక ఆర్థిక వికాసం కోసం ప్రవేశ పెట్టిన పథకం రాష్ట్ర ప్రభుత్వాల అమలులో నిర్లక్ష్యం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2015 ఏప్రిల్‌ నుండి జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేషనల్‌ గర్ల్స్‌ డెవలప్‌ మెంట్‌ మిషన్‌ కార్యక్రమ రూపకల్పన జరిగింది. బాలికల సంరక్షణ కొరకు ఆడపిల్లలకు షరతులతో కూడిన ధనలక్ష్మి పథకం’ కిశోరి శక్తి యోజన సుకన్య ‘స్వమృద్ది యోజన పౌస్టి ఆహార పథకం మొదలగు పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది 1989వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించి సభ్య దేశాలలో ఆడపిల్లల సామాజిక ఆర్థిక సాంఘిక సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పూనుకున్నది.
స్త్రీల అక్షరాస్యత.. జనాభాలో నేటికీ 20 కోట్ల మంది మహిళలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. వీరిని అక్షరాస్యులను చేసినప్పుడు మాత్రమే మహిళా సాధికారత సాధ్యమవుతుంది.
స్త్రీ పురుష నిష్పత్తి.. రోజురోజుకీ ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది ఇలాగే కొనసాగితే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది 2011లో స్త్రీ పురుష నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో ఆరు సంవత్సరాల లోపు వయసు కలిగిన బాలికలు ప్రతి వెయ్యి మంది బాలురకు 914 మంది మాత్రమే ఉన్నారు. బాల్యవివాహాలు దేశంలో 26.5శాతం బలవంతపు బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ప్రపంచములో జరుగుతున్న 40 శాతం బాల్యవివాహాలు మన దేశములో జరుగుతున్నాయని ‘‘యూనిసెఫ్‌’’ వెల్లడిరచింది . మన దేశములో 40 శాతం బలవంతపు బాల్య వివాహాలు పశ్చిమబెంగాల్లో చోటుచేసుకోవడం గమనార్హం
బ్రూణహత్యాలు.. ఆడపిల్లను మైనస్‌ గా భావించి మగ శిశువును ప్లస్‌ గా పరిగణించే మానసిక స్థితి సమాజంలో నెలకొనడం వల్ల పుట్టుకతోనే ఆడపిల్లల భ్రూణహత్యాలకు బలై వివక్షతకుగురిఅవుతున్నారు లిపేదరికం.అల్పపౌస్ట్టికాహారంలి బాలికలకు ఉన్నత విద్య సమస్యగా మారింది. నేటికీ 40 శాతం పైగా బాలికలు పదవ తరగతి కంటే ముందే బడి మానేస్తున్నారు బడి మానుకొని గ్రామాలలో వ్యవసాయ రంగంలో అసంఘటిత ప్రైవేట్‌ రంగంలో బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. శ్రమ దోపిడీకి ‘లైంగిక వివక్షతకు భిక్షాటనకు గురవుతూ తమ అమూల్యమైన బాల్య దశను పేదరికం’ ఆకలిచావులు అల్ప పౌష్ఠికాహారం’ అనారోగ్యానికి గురౌతున్నారని అనేక అద్యయనాలల్లో తేలింది.
` నేదునూరి కనకయ్య 9440245771

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు