Sunday, May 12, 2024

” కుటుంబపాలన, అవినీతిపైనే మా పోరాటం “

తప్పక చదవండి
  • హామీల అమలేదీ.. పాతబస్తీకి మెట్రో ఏదీ..?
  • దయచేసి మా ఇద్దరిపై అసత్య ప్రచారాన్ని ఆపండి..
  • కిషన్ రెడ్డికి మేమంతా శిష్యులవంటివాళ్లం..
  • తననునన్ను రారా.. పోరా అనేది ఆయనొక్కరే..
  • అందరం కలిసి ముందుకు సాగుతాం : బండి సంజయ్..
  • 8న మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి..

కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే భాజపా లక్ష్యమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. “భారతీయ జనతాపార్టీ రెండు ప్రధాన అంశాలపై పోరాటం కొనసాగిస్తోంది. ఒకటి కుటుంబ పాలన, రెండోది అవినీతి. ఈ రెండు విషయాల్లో ప్రధానమంత్రి మోదీ స్వయంగా ఎర్రకోట నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని భారత ప్రజల ముందు పెట్టారు. ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. రాష్ట్రంలో నయా నిజాం తరహా పాలన సాగుతోంది. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగటం లేదు. నిరంకుశ పాలనకు పాతరేయాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు. కల్వకుంట్ల కుటంబాన్ని ఫార్మ్ హౌస్ కు పరిమితం చేయాలి. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. బీఆర్ఎస్ నయా నిజాం పాలనపై పోరాట చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీల నుంచి నైతికంగా రాజకీయాలు చేయడంలోనూ కేసీఆర్ సర్కారు వైఫల్యం చెందిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌజ్ కు పరిమితం చేస్తామని మండిపడ్డారు. జులై 9న మోదీ వరంగల్ కు వస్తున్న సందర్భంగా కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. వరంగల్ లో రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కు ప్రధాని భూమి పూజ చేస్తారని.. అనంతరం వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.

ఎస్సీలకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘గిరిజన బంధు అమలు ఏమైందో సీఎం చెప్పాలి. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ఆస్పత్రులు నిర్మిస్తామన్న హామీ అటకెక్కింది. రైతులకు రూ. లక్షల రుణమాఫీ ఎక్కడికి పోయిందో సీఎం చెప్పాలి. పార్టీ కార్యాలయాలకు భూములు ఇస్తున్నారు కానీ, పేదలకు ఇల్లు కట్టివట్లేదు. కేంద్రం సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తామంటే భూమి ఇవ్వట్లేదు. ఫలక్ నుమా వరకు నడవాల్సిన మెట్రోను ఎంజీబీఎస్ వద్దే ఆపారు. పాతబస్తీకి మెట్రో లైన్ ఎందుకు నిర్మించడం లేదో సీఎం కేసీఆర్ చెప్పాలి’ అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ రెండు ప్రధాన అంశాలపై పోరాటం కొనసాగిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. కుటుంబ పాలనను, అవినీతిపై బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఈ రెండు విషయాల్లో ప్రధాని మోదీ స్వయంగా ఎర్రకోట నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని భారత ప్రజల ముందు ఉంచారని చెప్పుకొచ్చారు. ఎన్నో పోరాటల తర్వాత సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగటం లేదని అన్నారు.

- Advertisement -

సోషల్ మీడియాలో తనకు, కిషన్‌రెడ్డికి, తమ పార్టీలోని ఇతర నాయకులకు వ్యతిరేకంగా చేస్తోన్న ప్రచారాన్ని దయచేసి ఆపివేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. సందట్లో సడేమియాలా కొంతమంది ఇతర పార్టీల నాయకులు వీటి ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ప్రచారం ద్వారా అయ్యేది లేదు… పోయేది లేదని, వాటిని తామెవరం పట్టించుకోమన్నారు. ఇలాంటి అలవాటు ఏమాత్రం మంచిది కాదన్నారు. మన పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు సరికాదు.. ఇక్కడ అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రామరాజ్య పాలన తెచ్చే విధంగా పని చేద్దామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పెద్దలు, మా అందరి నాయకుడు కిషన్ రెడ్డి గతంలో పని చేసిన విధానాన్ని మనమంతా చూశామని, కిందిస్థాయి నుండి ఢిల్లీ వరకు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అలాగే తెలంగాణ ఆవిర్భవించాక ఇక్కడా పార్టీని శక్తిమంతంగా తయారు చేశారన్నారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు తెలపడానికి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించడంలో కిషన్ రెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు. వాస్తవానికి కిషన్ రెడ్డికి తామంతా శిష్యులలాంటి వారమన్నారు. మొదటి నుండి తనను రారా… పోరా అని కొట్టేది ఆయన ఒక్కరే అన్నారు. యువమోర్చాలో ఉన్నప్పుడు, విద్యార్థి పరిషత్ లో గొడవలు జరిగినప్పుడు ఏదైనా ఉంటే తాను ఆయనకే ఫోన్ చేసేవాడినన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ అవినీతి పాలనపై అందరం కలిసి పోరాటం చేస్తామన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు