Wednesday, May 15, 2024

యుద్ధ విమానాల ప్లాంట్‌ని సందర్శించిన కిమ్‌

తప్పక చదవండి

మాస్కో: రష్యా పర్యటనలో ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ శుక్రవారం యుద్ధ విమానాల ఫ్యాక్టరీని సందర్శించారు. కొమ్సోమోల్‌స్క్‌ ఆన్‌ అముర్‌లోని ఫ్యాక్టరీలో అత్యంత ఆధునిక ఫైటైర్‌ జెట్‌ ఎస్‌యూ57ను కిమ్‌ ఆసక్తికరంగా పరిశీలిస్తున్నట్లుగా ఉన్న వీడియోను రష్యా కేబినెట్‌ విడుదల చేసింది. ఒక ఎస్‌యూ35 ఫైటైర్‌ జెట్‌ ల్యాండ్‌ అయినప్పుడు కిమ్‌ చప్పట్లు కొడుతున్నట్లుగా ఉంది. కిమ్‌ సుఖోయ్‌ ఎస్‌జే`100 ప్యాసింజర్‌ విమానాల ప్లాంట్‌ను కూడా సందర్శించారని తెలిపింది. కిమ్‌ వెంట రష్యా ఉప ప్రధాని డెనిస్‌ మంటురోవ్‌ ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు