Thursday, May 16, 2024

జస్టిస్ ఏ. సంతోష్ రెడ్డికి ఘన సన్మానం.

తప్పక చదవండి

హైదరాబాద్, పదవీ విరమణ ను పురస్కరించుకుని జస్టిస్ ఏ. సంతోష్ రెడ్డిని ఘనంగా సన్మానించిన తెలంగాణ న్యాయమూర్తుల సంఘం, న్యాయమూర్తుల హౌసింగ్ సొసైటీ.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ ఏ సంతోష్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం నేతగా చేసిన సేవలను కొనియాడుతూ తెలంగాణ న్యాయమూర్తుల సంఘం, న్యాయమూర్తుల హౌసింగ్ సొసైటీ నేడు హైదరాబాదులో (లకడి కా పూల్ లోని హోటల్ లో) ఘనంగా సన్మానించింది. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులు నందికొండ నర్సింగ్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో న్యాయమూర్తుల సంక్షేమం కోసం, న్యాయమూర్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా జస్టిస్ సంతోష్ రెడ్డి చేసిన సేవలను పలువురు న్యాయమూర్తులు కొనియాడారు. ఈ సందర్భంగా జస్టిస్ ఏ. సంతోష్ రెడ్డి 32 సంవత్సరాల పాటు వివిధ హోదాలలో న్యాయమూర్తిగా పనిచేసారని, మేజిస్ట్రేట్ కోర్టు నుండి జిల్లా కోర్టు న్యాయమూర్తిగా, న్యాయశాఖ కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా గొప్ప సేవలు అందించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తుల సంఘంలో పలు బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులుగా సమర్థవంతంగా పనిచేసి న్యాయమూర్తులు ఎదుర్కొనే అనేక సమస్యలపై ఎంతో కృషిచేసి న్యాయమూర్తుల అభ్యున్నతికి కృషి చేశారని వక్తలు జస్టిస్ ఏ సంతోష్ రెడ్డిని కొనియాడారు. వేద పండితుల ఆశీర్వచనంతో ప్రారంభమైన కార్యక్రమంలో తెలంగాణ న్యాయమూర్తుల హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షులు తిరుపతి, కార్యదర్శి జీవన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం ఉపాధ్యక్షులు కే. ప్రభాకర్ రావు, సుదర్శన్ న్యాయమూర్తుల సంఘం ప్రధాన కార్యదర్శి కే. మురళీమోహన్, సహాయ కార్యదర్శులు దశరధ రామయ్య సభ్యులు శ్రీవాణి, వెంకటేశ్వరరావు హౌసింగ్ సొసైటీ సభ్యులు కుంచాల సునీత కే. పట్టాభి రామారావు, న్యాయమూర్తుల సంఘం పూర్వ అధ్యక్షులు రాజగోపాల్ జిల్లా జడ్జిలు ప్రతిమ, బాల భాస్కరరావు , శ్రీదేవి తదితరులు కార్యక్రమంలో పాల్గొని ఏ సంతోష్ రెడ్డిని సన్మానించారు. న్యాయమూర్తులు గజమాలతో జస్టిస్ సంతోష్ రెడ్డిని సత్కరించారు.

ఈ సందర్భంగా సన్మాన గ్రహీత జస్టిస్ ఏ. సంతోష్ రెడ్డి మాట్లాడుతూ తన 32 సంవత్సరాల న్యాయమూర్తిగా పొందిన అనుభవాలను పంచుకున్నారు. . పదవి విరమణ పొందినప్పటికీ న్యాయమూర్తుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిగా వారికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. తనను ప్రేమతో ఘనంగా సన్మానించిన తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తులకు జస్టిస్ ఏ .సంతోష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. పదవీ విరమణ తర్వాత కూడా న్యాయమూర్తుల సమస్యల పరిష్కారం కోసం న్యాయమూర్తుల సంఘానికి గౌరవ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా న్యాయమూర్తుల సంఘం, సొసైటీ చేసిన విజ్ఞప్తికి జస్టిస్ ఏ.సంతోష్ రెడ్డి సానుకూలంగా స్పందించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు