Friday, July 19, 2024

తల్లి దండ్రులను బాగా చూసుకోండి,,

తప్పక చదవండి
  • పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం లో,,, పూర్వం గురువు నరసింహ స్వామి,,,,
    హైదరాబాద్, తల్లి దండ్రులను బాగా చూసుకోండని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పూర్వం తెలుగు పండితులు గురువు నరసింహ స్వామి తెలియజేశారు.
    ఆదివారం నంగనూర్ గ్రామం లో 1996-1997 సంవత్సరము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి నాటి విద్యను భోధించిన గురువులు రొడ్డ రాంచ్రంధ్ర రెడ్డి, నరసింహ స్వామి, ఈ రాంచంద్ర రెడ్డి, వ్యాయమ గురువు నరసింహ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్, అక్కెనపల్లి వెంకట రాంరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది స్వామి సార్ మాట్లాడుతూ 26 సంవత్సరాల తరువాత మిమ్ములను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమనికి మమ్ములను ఎంతైతే ప్రేమ ఆప్యాయతలతో చూశారో మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడ చూసుకోవాలని పేర్కొన్నారు.
    కొంతమంది పిల్లలు తల్లి దండ్రులను అనాద శరణాలయాలలో చేర్పిస్తే.. వృధ దంపతులు చాలా భాధలు పడుతున్నారన్నారు.. కావున దయచేసి మీరు మీ తల్లి దండ్రులను మీతోనే ఉంచుకొని బాగా చూసుకోవాలన్నారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ప్రత్యేకంగా ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గత స్మృతులను నెమరువేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాలలో కలియ తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు. తమ విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు, కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ, సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, దేవులపల్లి యాదగిరి, కొత్త కాపు మహేందర్ రెడ్డి, నెల్లూట్ల నర్సిములు, సుధాకర్, జీడిపల్లి రజినీకర్ రెడ్డి, చక్రధర్, పాత సురేష్, లుబిన, కమల, సుకన్య, స్వరూప, సువర్ణ, మంజుల, రజిత, రాణి కవిత, అరుణ, ఉమామహేశ్వరీ, మాధవి, సాయిలు, తుపాకుల శ్రీను, సూర్య నారాయణ, నేపాల్ శ్రీను, రమేష్, కొడముంజ బాబు, గణేష్, హరికృష్ణ, ప్రకాష్, రాజిరెడ్డి, షేక్‌ ఇమామ్, పర్శరాములు, రాజు, రవీందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, కత్తుల శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, రాజిరెడ్డి, మధు తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు