Monday, April 29, 2024

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ సరూర్ నగర్ సర్కిల్..

తప్పక చదవండి
  • ఇక్కడ ప్రభుత్వ నియమ, నిబంధనలు గోల్ మాల్ గోవిందా?
  • సరూర్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ లో ఏకచత్రాధిపత్యం వహిస్తున్న
    ఏ.సి.పి. దేవేందర్, సెక్షన్ ఆఫీసర్ కిష్టయ్య..
  • క్రింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి ఉన్నతాధికారుల
    వరకు అందరిదీ ద్వంద వైఖరి..
  • అవినీతి ఆరోపణలు, మీడియాలో వరుస కథనాలు.. ?
  • డోంట్ కేర్ అంటున్న అధికార యంత్రాంగం..
  • అక్రమ నిర్మాణాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు
    వాటిని పరిశీలించే నిర్మాణాలు పూర్తి..
  • అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఉన్నతాధికారులు
    తక్షణమే స్పందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని
    సామాజిక కార్యకర్తల డిమాండ్.. ?

ఎల్బీనగర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా పొందుపరిచిన చట్టం టి.ఎస్. బీ.పాస్.. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని సరూర్ నగర్ సర్కిల్ -5 లో చట్టాలు, నియమ, నిబంధనలు వర్తించవు.. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు.. గోల్ మాల్ గోవిందా.. అందుకు ఎన్నో ఉదాహరణలుగా ఉన్నాయి.. అక్రమ నిర్మాణాలపై సామాజిక మాధ్యమాల్లో, పలు దిన పత్రికలలో ఎన్నో అంతులేని కథనాలు.. ప్రచురించబడ్డాయి.. సరూర్ నగర్ సర్కిల్ లో నిబంధనలు ఉల్లంఘించి, అక్రమ నిర్మాణాలు నిర్మించటం ఇక్కడ కామన్ గా మారిపోయింది.. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే వాటిని పరిశీలించే లోపే నిర్మాణాలు పూర్తి అవ్వడం పరిపాటిగా జరిగిపోతుంది… గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని కమలా నగర్ లో ఓ గృహ నిర్మాణదారుడు రెండు అంతస్తుల భవనానికి అనుమతులు తీసుకొని, ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు.. చైతన్యపురి డివిజన్, మారుతి నగర్ ప్రధాన రహదారిలో.. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపడుతున్నాడు… కొత్తపేట్ డివిజన్ లో, మారుతీ నగర్ లో ఓ గృహ నిర్మాణదారుడు రెండు అనుమతులు తీసుకొని.. ఒకే నిర్మాణం పనులు చేపడుతున్నాడు.. కొత్తపేట్ డివిజన్.. మోహన్ నగర్ ప్రధాన రహదారిలో మరో గృహ నిర్మాణదారుడు డొమెస్టిక్ అనుమతులు తీసుకొని, సెల్లార్ తో కూడిన నిర్మాణం నిర్మిస్తూ, కమర్షియల్ భవనంగా మారుస్తూ నిర్మిస్తున్నాడు.. అదనంగా మరో ఫ్లోర్ నిర్మాణ దశలో ఉన్నది… ఈలాంటి అక్రమ నిర్మాణాలు పదుల సంఖ్యలో ఉన్నా.. అధికారులు అటువైపు కన్నెత్తి చూడని వైనంగా కనిపిస్తుంది .. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే.. అధికారులపై ఒత్తిడి పెరిగితే వాటికి నోటీసులు ఇవ్వడం.. కాలయాపన చేయడం పరిపాటిగా మారిపోయింది.. ఈ అక్రమ నిర్మాణదారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ.. ప్రభుత్వ నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎదేచ్చగా నిర్మాణాలు చేపడుతున్నారు.. అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదంటే అందుకు కారణం ఏమిటి? అందుకున్న చీకటి ముడుపు లేనా ? ఈ అవినీతి అధికారులపై ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏమాత్రం లెక్క చేయకుండా డోంట్ కేర్ అంటున్న వైనం… ఈ తదంగం అంతా ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నా.. టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి. దేవేందర్, సెక్షన్ ఆఫీసర్ కిష్టయ్యలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సామాజిక కార్యకర్తలు.. ఉన్నతాధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు… ఏప్రిల్ 20- 2023 న ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కు.. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో.. ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.. ఈ అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, జోనల్ కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం..

అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫైల్ నెంబర్, పర్మిట్ నెంబర్స్ :
1) ఫైల్ నెంబర్ 248941/జి.హెచ్.ఎం.సి/0414/2023.. పర్మిట్ నెంబర్ 248941/0259/జి.హెచ్. ఎం.సి./2023..
2) ఫైల్ నెంబర్.. 215216/జి.హెచ్.ఎం.సి./19377/ 2022.. పర్మిట్ నెంబర్ 215216/ 11155/ జి.హెచ్.ఎం.సి./2022..
3) ఫైల్ నెంబర్ 215193/జి.హెచ్.ఎం.సి./19372/2022.. పర్మిట్ నెంబర్ 215193/11214/జి.హెచ్.ఎం.సి./2022..
4) ఫైల్ నెంబర్ 233481 జి.హెచ్.ఎం.సి./23196/2022.. పర్మిట్ నెంబర్ 233481/ 12868/జి.హెచ్.ఎం.సి/ 2022..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు