Saturday, April 27, 2024

మెకానికల్‌ విభాగంలో ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించిన జెఎన్టీయూ కూకట్‌పల్లి

తప్పక చదవండి

జెఎన్టీయూ : జెఎన్టీయూ కూకట్‌పల్లి, క్యాంపస్‌ కాలేజీలో నేడు యూనివర్సిటీ రిజిస్టార్‌ డా మంజూరు హుసేన్‌ పదవి విరమణ సందర్బంగా మెకానికల్‌ డిపార్ట్మెంట్‌లో జిబికె రావు సెమినార్‌ హల్‌లో అడ్వాన్స్‌ టెక్నాలజీ ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అనే అంశం మీద ఒక రోజు జాతీయ సదస్సు ను కన్వీనర్‌ గా మెకానికల్‌ డిపార్ట్మెంట్‌ ప్రొఫెసర్‌ డా పి ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిధిగా యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌ లర్‌ డా. కట్టా నర్సింహా రెడ్డి,యూనివర్సిటీ రెక్టర్‌ డా. గోవర్ధన్‌,యూనివర్సిటీ రిజిస్టర్‌ డా. మంజూరు హుసేన్‌,కాలేజీ ప్రిన్సిపాల్‌ డా. కె విజయ కుమార్‌ రెడ్డి,వైస్‌ ప్రిన్సిపాల్‌ డా.జి.వి. నర్సింహా రెడ్డి మెకానికల్‌ డిపార్ట్మెంట్‌ హెడ్‌ డా.ఇ రాంజీ జెఎన్టీయూ అల్యూమిని (పూర్వ విద్యార్థి సంఘ)డా. హరి ఇప్పన పల్లి పలువురు మంజూరు హుసేన్‌ పూర్వ విద్యార్థులు, డిపార్ట్మెంట్‌ లో పని చేస్తున్న పలువురు సీనియర్‌ ఫ్రొఫెసర్స్‌, కాంటాక్ట్‌ అధ్యాపకులు పాలొగొన్నారు. ఈ సెమినార్‌లో 30కి పైగా పేపర్‌ ప్రజంటేషన్‌ వివిధ అంశాలమీద చర్చకు రావడం జరిగింది. అనుభవం గల పలువురు అధ్యాపకులు మెకానికల్‌ రంగంలో రావాల్సిన అనేక కొత్త కొత్త మార్పులు పై వారి అభిప్రాయాలు తెలియచేసారు. మెకానికలో రంగం పలు కొత్త కొత్త ఆవిష్కరణ జరగాలి అన్నారు యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌ లర్‌ డా. కట్టా నర్సింహా రెడ్డి, డా. మంజూరు హుసేన్‌ పదవి విరమణ సందర్బంగా వారు ఎక్కడ పని చేసిన కూడా అంకిత భావంతో తమ పని తాము చేసుకొని పోయే వ్యక్తి గా ఆయా పదవులకు వన్నె తెచ్చేలా పనిచేసారని కొనియాడారు. రెక్టర్‌ డా. మంజూరు హుసేన్‌ ద్వారా ఆయా పదవుల్లో ఎలా నడుచుకుంటూ పోవాలి అన్న విషయం అందరూ నేర్చుకోవాలి అన్నారు ప్రిన్సిపాల్‌ కె విజయ కుమార్‌ రెడ్డి మంజూరు హుసేన్‌ వ్యక్తిత్వం మంచిది, తోటి అధ్యాపకుల కు ఎలాంటి సమస్య వచ్చిన సబ్జెక్టు పరమైన విషయాలు బాగాచర్చలు చేసి విద్యార్థులకు సున్నితం గా విషయాలు అర్ధం చేసుకునేలా ఎలా భోదన చేయాలో తెలియ చేసేవారని గుర్తు చేసారు. రిజిస్టర్‌ డా. మంజూరు హుసేన్‌ సదస్సు ను ఉదేశించి మాట్లాడుతూ వైస్‌ ఛాన్స్‌ లర్‌ రెక్టర్‌ ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, నా తో పని చేసిన నా క్లోలిగ్స్‌ పూర్వవిద్యార్థులు అన్ని డిపార్ట్మెంట్‌ లో పని చేస్తున్న ప్రొఫెసర్స్‌ ఇతర ఉద్యోగస్తూ లుఅందరికి సహాయంతో నేను నా కు ఇచ్చిన పదవిని నిర్వహించడం జరిగింది మీ అందరి సహాయం లేకపోతే నేను ఈరోజు మీ ముందు ఇలా ఉండే వాడిని కాదు వైస్‌ ఛాన్స్‌ లర్‌ నా పట్ల చూపించి అభిమానం ఇచ్చిన బాధ్యత కు అనేక ధన్యవా దములు అన్నారు. ఒకరోజు నేషనల్‌ కన్ఫరెన్స్‌ను అత్యంత సమవర్ధ వంతంగా నిర్వహించడలో నా తోటి ఆచార్య లు డా. పి.ప్రసన్న కు, డా. జే. సురేష్‌ కుమార్‌ కు ధన్యవాదములు తెలియ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు