Tuesday, May 14, 2024

30 కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలానికి ఎసరు పెట్టిన బొల్లినేని నిర్మాణ సంస్థ.. !

తప్పక చదవండి
  • శేర్లింగంపల్లి మండల పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ మాఫియా అక్రమ భాగోతం..
  • ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఫెన్సింగ్ వేసిన ఆక్రమణదారులు..
  • సీపీఎం నాయకులు శోభన్ ఫిర్యాదుతో ప్రభుత్వ స్థలం చుట్టూ కడీలు పాతి
    సూచిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు..
  • కడీలను ధ్వంసం చేసి, సూచిక బోర్డు పీకేసిన బొల్లినేని నిర్మాణ సంస్థ..

శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఎక్కడ సర్కార్ స్థలాలు ఉంటాయో.. ఆ చుట్టుపక్కలే భూములు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు. మెల్ల మెల్లగా పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కలిపేసుకుని వాటి చుట్టూ గోడ కట్టి.. అందులోకి ఎవరినీ ప్రవేశించనీయకుండా కట్టుదిట్టం చేస్తున్నారు.. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వద్ద చేపట్టిన ‘బొల్లినేని నిర్మాణ సంస్థ’ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసింది అని స్థానికులు ఆరోపిస్తున్నారు.. సర్వే నెంబర్ 44లో 1.21 గుంటల సర్కార్ స్థలం ఉంది. గతంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యాక్షన్ లో 1.10 గుంటలు కొనుగోలు చేసింది. అది పోను మరో 11 గుంటల భూమి అలాగే ఉండి పోయింది. అయితే ఇటీవల ‘బొల్లినేని నిర్మాణ సంస్థ’ భారీ అపార్టుమెంట్ల నిర్మాణం చేపట్టింది. ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా వేశారు. అందులో యాక్షన్ లో మిగిలిన 11 గుంటల స్థలం కూడా కలిపేసుకున్నారు. దీంతో ఆ స్థలంలోకి వెళ్లాలంటే తప్పనిసరిగా ఆ సంస్థ ఏర్పాటు చేసిన గేట్ నుండి పోవాల్సి వస్తుంది. అక్కడ సెక్యూరిటీని పెట్టి ఎవరిని అందులోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు సెక్యూరిటీ సిబ్బంది. దీనిపై సీపీఎం నాయకులు శేరిలింగంపల్లి మండల తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయల స్థలం కబ్జా అవుతుందని, ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకుల ఫిర్యాదుతో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శ్రీనయ్య, సిబ్బంది స్థలం చుట్టూ కడీలు ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ స్థలం అంటూ హెచ్చరిక బోర్డు పెట్టారు. అయితే సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఇప్పుడా బోర్డును తొలగించి.. చుట్టూ కడీలను ధ్వంసం చేశారు. బోర్డును తీసేసి పక్కన పడేశారు. దీనిని బుధవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనయ్య, సీపీఎం నాయకులు శోభన్ పరిశీలించారు. నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటామని ఆర్ ఐ శ్రీనయ్య తెలిపారు. సర్కార్ స్థలం కబ్జాపై సీపీఐ నాయకులు తహశీల్దార్ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు