Monday, May 6, 2024

సృష్టిలో కళా కారుల జన్మ ధన్యం.

తప్పక చదవండి
  • డా. వేణు గోపాలా చారి.

భారతీయ నృత్య, సంగీత, సాహిత్యాలకు ఎనలేని ప్రాధాన్యత వున్నదని, సాంస్కృతిక నాగరికత జాతీయత ద్వారా ఆత్మీయతను, ఆత్మ సంతృప్తిని పెంపొందిస్తున్నదని ముఖ్య అతిధి డా.వేణు గోపాలాచారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతి సమావేశ మందిరంలో ‘శ్రావణ సౌరభాలు’ సంగీత, నాట్య హాస్య కార్యక్రమము మంగళవారం రాత్రి 25/7/23 న, సరస్వతి ఉపాసకులు సంఖ్యా శాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన నీటి పారుదల శాఖ చైర్మన్ డా.వేణు గోపాల చారి మాట్లాడుతూ.. తెలంగాణాలో ఈనాడు కళలు ముప్పేట విరజిమ్ము తున్నాయని, మరింతగా కళాకారుల ప్రతిభ వెలికి రావాలని అన్నారు. అనంతరం కళాకారులను సత్కరించారు. సభాదక్షులు దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయం లో సంగీత,సాహిత్య,నాట్యము త్రివేణి సంగమంలా పెనవేసుకున్నాయని వాటిని పరి రక్షించే బాధ్యత కళాకారులదే అన్నారు.
ఈ సందర్భంగా కళాకారిణి చిరంజీవి పర్ణిక కూచిపూడి నృత్యం,గాయనీ గాయకులు సంగీత విభావరి ఎంతగానో ఆహ్లాదాన్ని కలిగించాయి.. బుర్రమోహన కృష్ణ వ్యాఖ్యానంతో సభను అలరించారు. శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యా రాణి, కన్వీనర్ రఘు కార్యక్రమ సారథులు అయినారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు