- డిమాండ్ చేసిన ప్రశ్నించే గొంతు శ్యామ్ సుందర్ రెడ్డి..
తెలంగాణ ప్రభుత్వం దళిత వర్గాల అభ్యున్నతి కోసం దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశ పెట్టడం సంతోషమని, తెలంగాణలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అందాలని, అలాగే బీసీల కోసం బీసీ బందు అనే పథకాన్ని ప్రవేశపెట్టిందని, బీసీలకు కూడా ప్రతి కుటుంబానికి బీసీ బందు అందాలని, అలాగే ఇటీవలే మైనార్టీల అభివృద్ధి కోసం కూడా కుటుంబానికి లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, మరి అగ్రవర్ణాలలోని పేదలు ఏం పాపం చేశారని, అగ్రవర్ణ కులాలలో కూడా తినడానికి తిండి లేని పేదవారు చదివించడానికి ఆర్థిక స్తోమత లేనివారు చాలామంది ఉన్నారని, వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రశ్నించే గొంతు శ్యామ్ సుందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేవలం అగ్రవర్ణ కులాలలో ఉన్న 10 శాతం నాయకులను, ధనికులను చూపించి అగ్రవర్ణ కులాలలో ఉన్న వారు మొత్తం ధనికులే అనడం సరికాదు అని ప్రశ్నించే గొంతు శ్యామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు.