Saturday, April 27, 2024

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ” సీజ్ “

తప్పక చదవండి
  • ఎల్బీనగర్ లో అడిషనల్ దందా
  • ఏడవ తరగతి వరకు అనుమతి, నిర్వహణ పదవ తరగతి వరకు
  • అడ్డు అదుపు లేని దోపిడి
  • సీజేఎస్ ఫిర్యాదుతో కదిలిన డొంక
  • సీజ్ చేసిన జిల్లా డీఈవో సుశీంధర్ రావు
  • కార్పొరేట్ స్కూళ్లలో తనిఖీలు నిర్వహించాలి: మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్

రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఎల్బీనగర్ ప్రాంతం మనసురాబాద్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఏడో తరగతి వరకు అనుమతి తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల కళ్ళు కప్పి 8 ,9 ,10 వ తరగతి వరకు తరగతులు నిర్వహణ కొనసాగిస్తున్నారు. నిజానికి హైస్కూల్ పర్మిషన్ కి పాఠశాల రీజినల్ జాయింట్ డైరెక్టర్ నుండి అనుమతి తీసుకోవాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా గత రెండు మూడు సంవత్సరాల నుండి పాఠశాలను కొనసాగిస్తూ విద్యాశాఖ అధికారులను, విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్యా సంవత్సరం చివరి వరకు వచ్చారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం అనుమతి లేదు అన్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పకుండా లక్షల్లో ఫీజులు వసూలు చేసి ఇటు విద్యార్థులను అటు తల్లిదండ్రులను మోసం చేసిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యజమాన్యం. ఈ అక్రమ దందాపై క్రైస్తవ జన సమితి ఫిర్యాదుతో స్పందించిన జిల్లా డీఈఓ సుశీంధర్ రావు ఆదేశాల మేరకు సరూర్ నగర్ ఎంఈఓ కృష్ణయ్య పాఠశాలను తనిఖీ చేసి సీజ్ చేశారు. నిజానికి విద్యా సంవత్సరం ప్రారంభం కాకమునుపే జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదు. కానీ గత ప్రభుత్వంలోని కొందరు నాయకులు కార్పొరేట్ పాఠశాలల భాగస్వాములై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించినా.. అడ్డుపడేవారని , అటువైపు వెళ్ళొద్దని హుకుం జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా జిల్లాలో అనేక కార్పొరేటు పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపైన విచారణ చేపట్టి విద్యా వ్యవస్థ బ్రష్టు పట్టకుండా, బాధ్యత యుతంగా అధికారులు తమ విధులు నిర్వహించాలని మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు