Thursday, October 10, 2024
spot_img

పఠాన్‌ చెరువులో మసకబారుతున్న మహిపాల్‌ రెడ్డి ఇమేజ్

తప్పక చదవండి
  • అనుచరుల భూ కబ్జాలే కారణమా.. ?
  • బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మార్పు తద్యమంటున్న పార్టీ శ్రేణులు..
  • నీలం మధు వైపు అధిష్టానం చూపు….
  • పార్టీ విధేయులకే టికెట్లు అంటూ అధిష్టానం సంకేతం…
    హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టి తమ సత్తా చాటాలని ఊవిళ్లూరుతోంది.. ప్రతిపక్షాల విమర్శలను సైతం తమకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేస్తోంది.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఆశావాహుల బలాబలాలు.. వారికి ప్రజల్లో ఉన్న ఆదరణను పలు సంస్థలతో సర్వే చేయించు కోవడంతో ఇంటిలిజెన్స్‌ రిపోర్టులు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం… పార్టీ విధేయుడుగా ఉండి క్లీన్‌ ఇమేజ్‌ తో పాటు ప్రజల్లో మంచి పేరు ఉన్నవారికే ఈసారి టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి పలుమార్లు ఎమ్మెల్యేల సమక్షంలోనే కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పారు. పటాన్‌ చెరువు నియోజకవర్గంలో ప్రస్తుత బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నీలం మధుల మధ్య టికెట్‌ వార్‌ తీవ్రంగా నెలకొని ఉంది.. క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న మధుకే టికెట్‌ వస్తుందని ఆయన అనుచర వర్గం ధీమా వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు మహిపాల్‌ రెడ్డి అనుచర వర్గం సైతం తమకే టికెట్‌ వస్తుందని ప్రచారం చేసుకుంటుండటం పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది.. అధిష్టానం ఎవరికీ టికెట్‌ ఇచ్చినా మరో వర్గం ప్రతి పక్ష పార్టీకి
    అనుకూలంగా వ్యవహరిస్తుందని ఈ ప్రాంతంలో జోరుగా ప్రచారం సాగుతోంది..
    మసకబారుతున్న మహిపాల్‌ రెడ్డి ఇమేజ్‌ :
    పఠాన్‌ చెరువులో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాలలో అధికార పార్టీ నాయ కుల ప్రమేయం ఉండటం.. అందులో అధికంగా ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు, సోదరుడి ప్రమేయం ఉన్నట్లు.. వారికి ఎమ్మెల్యే మద్దతు తెలుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండడం ఈ మధ్య కాలంలో అమీన్‌ పూర్‌ మండలంలో ఐలాపూర్‌, ఐలాపూర్‌ తండా గ్రామాల్లో పేదల ఇండ్లను కూల్చ డం.. వారిని రోడ్డుపాలు చెయ్యడంలో ఎమ్మెల్యే తమ్ముడి పాత్ర ఉందని బాహాటంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. వీటితో పాటూ ప్రజలకు కార్యకర్తలతో కూడా మహిపాల్‌ రెడ్డి దురుసు ప్రవర్తనే కారణం అంటూ కార్యకర్తలు సైతం బహిరంగంగా చర్చించుకోవడం తోనే మహిపాల్‌ రెడ్డి ఇమేజ్‌ మసక బారిందని స్థానికులు చర్చించుకోవడం చర్చనీయాంశంగా మారింది..
    బీ.ఆర్‌.ఎస్‌. పార్టీ అభ్యర్థి మార్పు తధ్యమంటున్న పార్టీ శ్రేణులు :
    గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపిపిగా కొనసాగిన గూడెం మహిపాల్‌ రెడ్డి..2014 అసెంబ్లీ ఎన్నికల్లో కా ంగ్రెస్‌ పార్టీ నుండి టికెట్‌ రాకపోవడంతో.. అప్పటి టి.ఆర్‌.ఎస్‌. పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలు పొందారు.. మరోసారి పార్టీ అవకాశం కల్పించడంతో 2019లో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు.. అప్పటి నుండి పార్టీలోని సీనియర్‌ నాయకులకు, ఉద్యమ కారులకు రాజకీయ అవకాశం లేకుండా.. కేవలం ఒక్క సామజిక వర్గం వారికి పెద్దపీట వేస్తుండటంతోనే పార్టీలో అంతర్గత పోరుకు అజ్యం పోసినట్లు తెలుస్తోంది..బీసీ వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్‌ సామజిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతుండటం అందరి చూపు అయనపై పడిరది.. నియోజక వర్గంలోని అయన సామజిక వర్గానికి చెందిన ప్రజలు అత్యధికంగా ఉండటం.. ప్రజలతో ఆయనకు ఉన్న సత్స సంబంధాలు కూడా ప్రజల్లో మంచి గుర్తింపునిచ్చాయి.. నియోజకవర్గ స్థాయిలో బీసీ వర్గ నాయకు డు ఎదగడంతో అధిష్టానం చూపు కూడా నీలం మధుపై పడిరది.. బి.ఆర్‌.ఎస్‌. సీనియర్‌ నాయకు లు, ఉద్యమ కారులు సైతం అయన వెంటే నడుస్తుండటం మధుకు కలసి వచ్చిం ది.. పార్టీలో మహిపాల్‌ రెడ్డికి దీటుగా నీలం మధు ఎదగడంతో స్థానిక ఎమ్మెల్యేకు చెక్‌ పడినట్లు తెలుస్తోంది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు