Sunday, September 8, 2024
spot_img

వీధి కుక్కల దాడి..

తప్పక చదవండి
  • తృతిలో ప్రాణాలతో బయటపడ్డ ఆరేళ్ల బాలుడు..
  • ధైర్యం చేసి కాపాడిన ఓ మహిళ..
  • స్థానిక నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదు..
  • తక్షణమే కుక్కలను తరలించాలన్నా స్థానికులు..
  • మల్కాజ్‌ గిరి, గౌతమ్‌ నగర్‌లో వెలుగుచూసిన దారుణం..
    మల్కాజ్‌ గిరి : చస్తే కానీ పట్టించుకోరా..చస్తున్నా వేడుక చూస్తారా.. అంటూ జిహెచ్‌ఎంసి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల తీరుపై కాలనీ వాసులు మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే ఇటీవలే వీధి కుక్కల దాడిలో కొంతమంది పిల్లలు చనిపోయిన సంఘటన మరవకముందే, మరో దారుణమైన సంఘటన మల్కాజ్గిరి నియోజకవర్గం, గౌతమ్‌ నగర్‌ 141 డివిజన్‌ పరిధిలోని, గౌతమ్‌ నగర్‌ లో చోటు చేసుకుంది. గౌతమ్‌ నగర్‌ సర్వోదయ స్కూల్లో యూకేజీ చదువు తున్న ఆరు సంవత్సరాల బాలుడు సత్యం ఆదివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆడుకుంటుండగా.. నాలుగు వీధి కుక్కలు అతి కిరాతకంగా దాడి చేయడంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులతో పరుగులు తీసి ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకున్నారు.. కుక్కలు దాడి చేస్తున్న విధానాన్ని చూసి ఏ ఒక్కరు ధైర్యం చేసి బాలుడ్ని కాపాడడానికి సాహసించలేకపోయారు.. చివరికి ఒక మహిళ ధైర్యం చేసి కుక్కలపై ఎదురుదాడికి ప్రయత్నించడంతో వీధి కుక్కలు బాలుని విడిచి పారిపోయాయి.. దీంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు అని స్థానికులు తెలిపారు.. గౌతమ్‌ నగర్‌ సర్వోదయ స్కూల్‌ చుట్టుపక్క పరిసరాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ.. చిన్న పిల్లలపై తరచూ దాడులు చేస్తున్నాయని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవ డంలేదని స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మహిళలు మాట్లాడుతూ.. హైదరాబాదులో ఎన్ని సంఘటనలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు మీరెత్తినట్టు విహరించడం సరికాదని, వీధి కుక్కల దాడుల్లో ఇంకెంత మంది పిల్లలు చనిపోవాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు. వెంటనే వీధి కుక్కలన్నిటిని కాలనీల నుంచి తరలించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు