ఇప్పుడు పరిపాలనలోకి రాబోతున్న నూతన ప్రభుత్వంకి ఎన్నో సమస్యలు ముందున్నాయి. ఒకవైపు రాష్ట్రప్రభుత్వ ఖాళీ ఖజాన మరోవైపు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చుకునే ఆరాటం..ఈ రెండూ గట్టెక్కాలంటే అనుభవంతో కూడిన ఆర్ధిక లావాదేవీల పాత్ర చాలా అత్యవసరం. గత పాలకులు ఇచ్చిన వాగ్ధానాలు గాలికొదిలి ఎవరూ అడగనివి తెరపైకి తెచ్చి ఖజానా ఖాళీకి సై అన్ళారు. అటు నిరుద్యోగపర్వం తాండవిస్తుంటే వాటిని కనీసం భర్తీచేసుకోవాలనే కనీస ఆలోచన లేకుండాపోయింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయే నాటికి మిగులుబడ్జట్‌తో వున్నామన్న ఆమాత్యులు రాష్ట్ర నిరుద్యోగ యువతని దివాళకోరులు గా తీర్చిదిద్ది ప్రతి ఉద్యోగ పరీక్ష లీకులతో నడిపిస్తే పాలకులేం పరిపాలన చేస్తున్నట్టు. ఉద్యమస్వ భావం వున్న రాజకీయ పార్టీ కదా అని నమ్మితే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భూముల్నీ అమ్మకానికే పెడితే భవిష్యత్ తరాలకేం మిగిలేనో ఎన్ని ఉచితాలన్నా గత పాలకులనెందుకు సాగనంపారో తెలుసుకొని మసలాలి నేటి ప్రభుత్వం. విద్యావ్య వస్థని పూర్తిగా విస్మరిస్తే పేదల పిల్లలకు యే కార్పొరేట్ విద్యనంది స్తారు. వైద్యం పూర్తిగా విచ్చలవిడిగా ప్రైవేట్ పరం చేస్తుంటే ఏమనాలి. అన్ని ప్రభుత్వ రంగసంస్థలను ఆగం చేస్తూ చదువుకు న్నవారికి ఉద్యోగా వకాశాలు లేకపోతే పరిణామం ఇదే అవుతుంది కదా. ప్రశ్నించే గొంతుకలని బందింతే కూడా సామాన్యుడు తన ఓటు నెలా ఆయుధంగా మలచుకుంటాడో మచ్చుకు ఇదేఅనవచ్చు. డబుల్ బెడ్రూంలయినా కావొచ్చు ఉద్యో గాలయినా గావొచ్ఛు మాటను నిలబెట్టుకోకుంటే ఎంతటివారైనా గల్లంతే .ఈ గుణపాఠా లెన్నో చరిత్ర చెబుతోంది. పశ్చిమబెంగాల్ నేలిన నాటి జ్యోతిబస్ కానివ్వండి ఇంకెవ్వరైనా సరే కాలగర్భంలో కలవాలల్సిందే. ఆయా ఉద్యోగ సంఘాలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లని పక్కన పెడితే కూడా అంతేమరి. నాడు ఆర్టీసి సమ్మేను మసిపూసి మారేడుకాయ చందంగా చేసి దాన్ని అవమానాలు పాల్చేస్తే ఏం మిగిలింది. ఉస్మానియా ద వాఖానాని పట్టించు కోకుండా విశ్వవిద్యాలయాల భూముల్నీ అమ్ముకుంటూ పోతే ఇక ఉచిత విద్యకీ ప్రాంగణాలేవి.. కేవలం రైతుబంధూనో ఇంకా మిగతా ఫింఛన్లు అంటే ఏ ప్రభుత్వా లైనా తమ చేతనైంత ఇవ్వొ చ్చు అయినా ఎందుకు గెల్వలేకపో యారో ఓట్లని విచ్చలవిడిగా కొనేశక్తి వున్నా అధికారం చేజిక్కించు కోలేదో తెలుసుకొని మసలుకుంటే కొత్త పాలకులకి కొంతకాలం ఉపశమనం వుంటుంది.నీళ్ళు నిధులు నియమాకాలను విస్మరిస్తే అఃతే సంగతీ మరి. ప్రజాస్వామ్యమనే స్పృహనే దెబ్బతీసే ప్రయ త్నాలు చేస్తే వారికిక ఓటు ఎంత శక్తివంతమైనదో గుణపాఠం నేర్చుకోవాలి. మతవైషమ్యాలతో నో పబ్బంగడుపుతామనేవారికీ ఇదొక గుణ పాఠమే. ఇప్పుడేర్పాటుగా పోయే ప్రభుత్వం చేసిన వాగ్ధానాలు అమలు చేయక కాలయాపన చేస్తే కూడా జరిగేది ఇదే ఫలితాలు కూడా ఇలానే వుంటొయి. విద్యావైద్యం తోబాటు కూడు గూడు ఆందించి ప్రతి కుటుంబం పనితో నిమగ్నమైయి వుంటే సంక్షేమం దానంతట అదే వస్తుంది..అలాగాకుండా అన్ని నిత్యా వసర వస్తు వుల ధరలు పెంచి సామాన్య జనాల నడ్డీ విరుస్తా మంటే పాలకులకి చివరికి మిగిలెది శూన్యం. ఇక్కడ ఆయా పార్టీలు గుర్తుంచుకోవాల్సినవిషయం..మీరు శాశ్వతంగాదు ఓటరే శాశ్వతం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే ఓటరు మనసులో ఏముం దో ఫలితాలే సమాధానం. అన్నిపార్టీలూ డబ్బు ఆశని చూపెట్టినా తిరుగుబాటు ఎలా వుంటదో ఈ ఎన్నికలే ఉదాహరణ. ప్రజా సంక్షేమమే పరమా వధిగా వుండాలి. ప్రజాస్వామిక లౌకిక విలువ లకి కట్టుబడివుం టేనే ఈ దేశంలో రాజకీయ పార్టీలకు మనుగడ వుంటుంది తప్ప ఘ జిమ్మిక్కు చేయజూసినా అధోగతే.. పాలకు లారా తస్మాత్ జాగ్రత్త… మానవీయ కోణంలో పరిపాలన లేకున్నా మనుషుల్ని బానిసలుగానో చూస్తెఓటరు తనఆయుధంతో జవాబు చెబుతాడు.పాలకులారా ఇచ్చిన వాగ్ధానాలను వెంటనే అమలు చేయండి. ప్రశ్నించేవారిని గౌరవిం చండి. ప్రజాస్వామిక లౌకిక విలువల్నీ విద్యార్ధులకి పౌరులందరికీ నేర్పండి. నీతీనిజాయి తీతో బ్రతకడం ఎలానో నేర్పండీ.సమాజం దానంతట ఆదేఉన్నత స్థితికి చేరుకుంటుంది. నిత్యం పదవీ వ్యామోహంతో అంతర్గత కుమ్ము లాటలు కూడా ప్రజలను తికమకబెట్టి మరో ఐదేళ్ళలోఇంకో మూ డోపార్టీకో అధికారం ఒప్పజెప్పితే మిమ్మల్నీ తెలంగాణ సమా జం నిత్యం వెంటాడుతుంటుంది.రాజకీయ ప్రలోభాలు తగ్గించి బ్యూరో క్రసీ ద్వారా మేధావుల ద్వారా సుపరిపాలనే ధ్యేయంగా ముందుకు కొనసాగితే మీకు ఓటరు జేజేలు పలుకుతాడు. ప్రజల ద్దకే వగళ్ళి ప్రజాసమస్యలకి నిష్పక్షపాతంగా పరిష్కరిస్తే అదే పదివేలు.
` యం.డి.రంజాన్ బేగ్ 9949552956
తప్పక చదవండి
-Advertisement-