Monday, July 22, 2024

మళ్లీ రెడ్ అలర్ట్..

తప్పక చదవండి
  • మరో మూడు రోజులు భారీ వర్షాలు..

ఎక్కడ చూసినా వరదలే వరదలు.. చెరువులకు గండ్లు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.. జలకళను సంతరిచుకున్న రిజర్వాయర్లు.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది.. తెలంగాణలో మాత్రం ఆ జిల్లా.. ఈ జిల్లా అనే తేడాయే లేదు.. అన్ని జిల్లాల్లోనూ వరుణుడు వరద బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వర్షాలతో దాదాపు అన్ని జిల్లాలు తల్లడిల్లుతున్నాయి. కొన్నిచోట్ల వరదల్లో కొందరు గల్లంతు కాగా.. పలువురు మరణించారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మళ్లీ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు