Tuesday, April 30, 2024

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో ఐపీఎల్‌ టికెట్ల దందా!

తప్పక చదవండి
  • స్టేడియం ఎదుటే బ్లాక్‌లో టికెట్‌ల అమ్మకాలు?
  • తనకి నచ్చిన సంస్థలకి కాంప్లిమెంటరీ టికెట్స్‌ కేటాయిస్తున్న ప్రెసిడెంట్‌ జగన్‌ మోహన్‌ రావు
  • క్లబ్‌ సెక్రటరీస్‌ టికెట్స్‌ అడిగితే మీరు నాకు ఫ్రీగా ఓటేశారా అంటున్న హెచ్‌సీఏ అధ్యక్షుడు..
  • అంబర్‌పేట ఎమ్మెల్యే 10 కాంప్లిమెంటరీ పాసులు కావాలని లేఖ
  • జీహెచ్‌ఏంసీ డిప్యూటీ కమీషనర్‌ సర్కిల్‌`2 వీవీఐపీ పాస్‌లు 80, వీఐపీ పాస్‌లు 80 కావాలని అభ్యర్థన
  • ప్రభుత్వం దృష్టిసారించాలంటున్నా క్రికెట్‌ అభిమానులు

హైదరాబాద్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ 2024 మ్యాచ్‌ల టికెట్లకు భారీగా డిమాండ్‌ ఉండటంతో అక్రమంగా టికెట్ల పంపకాలకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తెరలేపినట్టు బహిరంగ విమర్శలు వెలువెత్తుతు న్నాయి. ఏకంగా స్టేడియం ఎదుటే బ్లాక్‌ టికెట్‌ దందా మొదల్కెంది. టికెట్లతో పాటు కాంప్లిమెంటరీ పాసులను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను గతంలో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ జగన్‌మోహన్‌రావు తనకి నచ్చిన వాళ్ళకి, తనకి నచ్చిన సంస్థలకి కాంప్లిమెంటరీ టికెట్స్‌ కేటాయిస్తున్నాడని క్లబ్‌ సభ్యులే విమర్శించడం శోచనీయం. అంబర్‌పేట నియోజకవర్గ శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్‌ కాంప్లమెంటరీ టికెట్‌లు పది కావాలి అని ఏప్రిల్‌ 1వ తేదీన చీఫ్‌ ఎగ్జీక్యూటీవ్‌ ఆఫీసర్‌కు లేఖ రాయడం జరిగింది. అదే విధంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమీషనర్‌ సర్కిల్‌`2 ఉప్పల్‌ వీవీఐపీ పాస్‌లు 80, వీఐపీ పాస్‌లు 80కావాలని చీఫ్‌ ఎగ్జీక్యూటీవ్‌ ఆఫీసర్‌కు మార్చి30వ తేదీన లేఖ రాశారు. క్రికెట్‌ అభిమానులకు కేటాయించాల్సిన టికెట్‌లను అధికారులకు, నాయకులకు కేటాయించడం ఏంటని క్రికెట్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం గురించి మీడియా సంస్థ నుంచి ఫోన్‌ చేస్తే సరైన సమాధానం చెప్పడం లేదు.హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి, కోశాధికారి, మిగతా సభ్యులకు కూడా టికెట్‌ విషయంలో ఎవరిని కలవ కూడదు ఎవరితో మాట్లాడకూడదు అని హెచ్‌సీఏ అధ్యక్షుడు హూకుం జారీ చేస్తున్నాడు.హెచ్‌సీఏ క్లబ్‌ సెక్రెటరీ కార్యదర్శులు టికెట్స్‌ అడిగితే మీరు నాకు ఫ్రీగా ఓటేశారా..? డబ్బులు తీసుకొనే ఓటు వేశారు కదా?.. ఈరోజు టికెట్లు ఎలా అడుగు తారు అని సమాధానం ఇస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అహర్నిశలు కష్టపడి స్టేడియంని సుందరంగా ముస్తాబు చేసే ఎంప్లాయిస్‌కి కూడా ఒక్క టికెట్‌ కూడా కేటాయించకపోవడం బాధాకరం. గత ప్రభుత్వంలో కొంతమంది నాయకుల అండతో అసోసియేషన్‌ ఎన్నికల్లో నెగ్గి తన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని అసోసియేషన్‌ సభ్యులు విమర్శిస్తున్నారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు స్టేడియం లోని సుమారు 50,000 టికెట్లు అసలు ఎవరికి కేటాయి స్తున్నారో.. ఒక శ్వేతా పత్రం విడుదల చేయాలని ప్రేక్షకులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో స్టేడియం నిర్మాణం చేపట్టి ప్రభుత్వానికి ప్రమేయం లేకుండా టికెట్స్‌ కేటా యించడమేంటి ? రావుల రాజ్యం పోయిన ఇంకా ఇలాంటి వాళ్ల అరాచకాలు తగ్గడం లేదని సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ప్రభుత్వం ఈ అక్రమ దందాకు తెర లేపు తున్న అసోసి యేషన్‌పై, హెచ్‌సీఏలో జరుగుతున్న అక్రమ వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు