Sunday, May 19, 2024

మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

తప్పక చదవండి
  • సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించండి
  • ఖమ్మం, జిల్లా కలెక్టర్‌ వి పి గౌతం
    ఖమ్మం : మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, వారికి ప్రత్యేకంగా పలు వ్యాధులుపై అవగాహన కల్పించడంతో పాటు చికిత్సలు నిర్వహించేందుకు ప్రత్యేక ఆరోగ్య మహిళాకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. మంగళవారం స్థానిక పాత మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలోని బస్తీ దవాఖానాలో ఏర్పాటు చేసిన నూతన ఆరోగ్య మహిళ కేంద్రాన్ని కలెక్టర్‌, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా మహిళ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా ప్రతీ మంగళవారం మహిళలకు ప్రత్యేక ఓపీని ఏర్పాటు చేసి మహిళలకు సంబంధించి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, ఓరల్‌ కాన్సర్‌, బ్రెస్ట్‌ కాన్సర్‌, డయాగ్నోస్టిక్‌ , సూక్ష్మపోషక లోపాలు, మూత్ర నాళిక ఇన్ఫెక్షన్స్‌ , పీసీవోడీ, ఎస్‌ టిఐ, స్త్రీల శరీర బరువు నిర్వహణ తదితర మహిళల వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టుతున్నట్లు ఆయన అన్నారు. మొదటి విడతగా మార్చి 8 మహిళా దినోత్సవం నాడు జిల్లాలో 6 ఆరోగ్య మహిళ కేంద్రాలు ఎం.వి. పాలెం, మంచుకొండ, వైరా, కామేపల్లి, చెన్నూరు, బోనకల్‌ లలో ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. ఇప్పటివరకు ఈ కేంద్రాలలో 5795 మంది నమోదై చికిత్స పొందినట్లు, వీరిలో 790 మందికి ఉన్నత ఆరోగ్య కేంద్రాలకు రెఫర్‌ చేసినట్లు ఆయన అన్నారు. రెండో విడతగా స్థానిక పాత మునిసిపల్‌ కార్పొరేషన్‌ లోని బస్తీ దవాఖాన, సుబ్లేడు, ముదిగొండ, నేలకొండపల్లి, వేంసూరు, లంకాసాగర్‌ లలో ఆరోగ్య మహిళా కేంద్రాలు ప్రారభించినట్లు ఆయన తెలిపారు. ప్రతీ మంగళవారం ప్రత్యేకంగా మహిళా విభాగంచే ప్రత్యేక డాక్టర్‌ లతో మహిళలకు పరీక్షలు నిర్వహించి చికిత్సలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కార్యక్రమంలో నగర మేయర్‌ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ, మహిళలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య మహిళ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మేయర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహారా, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, ప్రోగ్రామ్‌ అధికారి డా. సైదులు, మెప్మా డిఎంసి సుజాత, వైద్యాధికారులు డా. సంధ్యారాణి, డా. రీతూ చౌదరి, డా. అవేంజిలిన, డా. లోహిత, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు