Sunday, April 28, 2024

విశ్రాంత ఉద్యోగుల వివరాలు ఇవ్వండి

తప్పక చదవండి

గత ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు
వివిధ శాఖల కేటాయింపు

  • అధికారులను ఆదేశించిన ప్రభుత్వ సీఎస్‌ శాంతికుమారి
  • గతంలో విశ్రాంత ఉద్యోగులపై కథనాలు ప్రచురించిన ఆదాబ్‌
  • ఎట్టకేలకు విశ్రాంత ఉద్యోగులపై దృష్టి సారించిన ప్రభుత్వం
  • కార్పోరేషన్లు, బోర్డులలో పాతుకుపోయిన రిటైర్డ్‌ ఉద్యోగులను
  • రీకాల్‌ చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం
  • వాటన్నింటిని తిరిగి సమీక్షించే పనిలో నిమగ్నమైన సర్కార్‌

హైదరాబాద్‌ : వివిధ స్థాయిల్లో పని చేస్తోన్న మాజీ అధికారుల వివరాలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ పొందిన పలువురు అధికారులను గత ప్రభుత్వం వివిధ శాఖలలో కీలకమైన విభాగాల్లో నియమించింది. ఇలా పదవీ విరమణ తర్వాత కూడా వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారిపై ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖలు, కార్పోరేషన్లు, బోర్డులలో పని చేస్తోన్న వారి వివరాలను ఇవ్వాలని ఆదేశించారు . ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి బుధవారం సాయంత్రం ఐదు గంటలలోపు నిర్ణీత నమూనాలో వివరాలు ఇవ్వాలని ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులను సీఎస్‌ ఆదేశించారు.
గత ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు వివిధ శాఖల కేటాయింపు
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు వివిధ కీలకమైన శాఖలను అప్పగించింది. వీటిపై ఆదాబ్‌ హైదరాబాద్‌ పత్రిక గతంలో పలు కథనాలను కూడా ప్రచురించింది. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ ఆరోపణలఫై ద్రుష్టి సారించడం పై సర్వత్ర ప్రశంశలు వినబడుతున్నాయి.. .ముఖ్యంగా ఇరిగేషన్‌,రెవెన్యూ, ఎండోమెంట్‌,విద్యుత్తు శాఖలతో పాటు పలు శాఖలలో లెక్కకు మించి ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. అయితే గత ప్రభుత్వం ఈ ఆరోపణలు పట్టించుకోలేదు. నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వం ఈ ఆరోపణలపై విచారణ జరుపుతూనే విశ్రాంత ఉద్యోగులకు శాఖల కేటాయింపులపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది. కీలకమైన శాఖలను కొంతమందికే గత ప్రభుత్వం ఎందుకు కేయించవలసి వచ్చింది..

- Advertisement -

కొంతమందిని ఎందుకు ఆ శాఖల్లోనే కొనసాగించవలసి వచ్చిందన్న దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.. వ్యవస్థలను గత ప్రభుత్వం ఇష్టానుసారముగా దుర్వినియోగం చేసిందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.విశ్రాంత ఉద్యోగుల వివరాలు అందిన వెంటనే ఆయా శాఖల్లో భారీగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వినబడుతున్నాయి.
రికార్డులను తారుమారు చేస్తున్న కొందరు ఉద్యోగులు..
నూతన ప్రభుత్వం కొలుదీరినప్పటికీ కొంతమంది ఉద్యోగులు గత ప్రభుత్వానికే మద్దతుగా నిలుస్తున్నారు. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి అవసరమైన సమాచారం ఇవ్వకుండా.. దాటవేత దోరణీతో ముందుకు సాగడం..ఒక తంతు అయితే గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని చేరవేయడం లాంటి పనులను కొంత మంది అధికారులు జంకు బొంకు లేకుండా చేస్తున్నారు. ఈ తంతంగా ఫై ప్రభుత్వం సీరియస్‌ యాక్షన్‌ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో జరిగిన ఫైళ్ల మాయంపై దర్యాప్తును ఆదేశించిన ప్రభుత్వం మరికొన్ని శాఖల్లో జరిగిన గొలుమాళ్లపై కూడా ప్రధానంగా ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు