- ఖమ్మంలో దొర రాజకీయాలు చేస్తుంది నువ్వు కాదా?
- పొంగులేటిపై బీఆర్‌ఎస్ నేతలు ఫైర్
ఖమ్మం : బీఆర్‌ఎస్ పార్టీలో ఉంటూ పార్టీనే వెన్ను పోటు పొడిచిన ఘనుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది అని ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ రావు విమర్శించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. బీఆర్‌ఏస్ పార్టీ లో ఉంటూ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర పై చేసిన వ్యాఖ్యలను చూస్తే దళితుల పై ఉన్న ప్రేమ ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. ఖమ్మం నగరంలో గడీలు నిర్మించి ఈ రోజు దొర రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులే పొంగులేటి తో ప్రమాదంలో పడిరదని వాళ్ల నాయకులే బహిరంగంగా చెప్పడమే నిదర్శనం అన్నారు. ఉమ్మడి ఖమ్మం పర్యటనలు చేసి కేసీఆర్, కేటీఆర్ మీద విమర్శలు చేసిన అంత మాత్రాన నువ్వు పెద్ద నాయకుడు కాలేవు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నీకు పదవి ఇచ్చిందని దానికి న్యాయం చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు,ఉద్యమకారులు నిన్ను ఉరికించి నారాయణ పురం పంపడం ఖాయమన్నారు. ఇప్పటికైనా పొంగులేటి నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, బీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య, రూరల్ మండల నాయకులు బెల్లం వేణు, తెలంగాణ ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ, బొమ్మర రామ్మూర్తి, లింగబోయిన సతీష్, పగడల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-