Tuesday, October 15, 2024
spot_img

జీహెచ్‌ఎంసీి అధికారులు స్పందించడం లేదు

తప్పక చదవండి
  • రాంగోపాల్‌ పేట్‌ బీజేపీ కార్పొరేటర్‌ చీర సుచిత్ర
    రాంగోపాల్‌ పేట్‌ : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షా లకు రాంగోపాల్‌ పేట్‌ డివిజన్‌ పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక బిజెపి కార్పొరేటర్‌ చీర సుచిత్ర శ్రీకాంత్‌ అన్నారు.ప్రజల ఇబ్బందులపై జిహెచ్‌ఎంసి అధికారులు స్పందిం చడంలేదని..ఎన్ని సార్లు పోన్‌ చేసిన వారి నుండి ఎలాంటి స్పందన లేదని ఆవేదన ఆమె వ్యక్తంచేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన తమను ప్రజల ఇబ్బందులు, సమస్యలపై జీహెచ్‌ఎంసీి అధికా రులకు స్పందన లేదని వాపోయారు.ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న కార్పొరేటర్‌ దంపతులు వర్షం లోనూ లోతట్టు ప్రాంతాలలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించారు. స్థాని కంగా వార్డ్‌ ఆఫీసు ఏర్పాటుచేసిన అక్కడ అధికారులు ఎవరు కూడా లేరని ఏ సమస్య పైన కూడా అధికారులు సిబ్బందికి స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడని జిహెచ్‌ ఎంసి వార్డు కార్యాలయం ఎందుకు ఏర్పాటు చేశారని కార్పొరేటర్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు