Saturday, July 27, 2024

మై హోమ్‌ సిమెంట్‌ పరిశ్రమలో ఘోర ప్రమాదం…

తప్పక చదవండి
  • ప్రీ హీటర్‌ కఫ్‌ హోల్డింగ్‌ కూలి ఒకరు మృతి ఇద్దరికీ తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
  • అనుమతి లేని కన్‌స్ట్రక్షన్‌లో వర్క్‌ చేస్తుండగా ప్రమాదం
  • పలుమార్లు వివాదాలకు నిలయంగా మారిన మై హోమ్‌ సంస్థ
  • రెవెన్యూ, పోలీస్‌ అధికారుల పర్యవేక్షణలో మై హోమ్‌ సంస్థ
  • ఎవరినీ లోపలికి అనుమతించని పోలీసులు
    సూర్యాపేట ప్రతినిధి/ మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా మై హోమ్‌ సిమెంట్‌ పరిశ్ర మలో ఘోర ప్రమాదం జరిగింది. మై హోమ్‌ సంస్థ కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న యూనిట్‌ ఫోర్లో లోని ప్లాంట్‌ లో మంగళవారం పని చేస్తుండగా ఫ్రీ హీటర్‌ కఫ్‌ హోల్డింగ్‌ కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.మరొకరి పరిస్థితి విషయంగా ఉండటంతో హైదరాబాద్‌ యశోద హాస్పిటల్‌ కి తరలించారు. మృతి చెందిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌ కు చెందిన అరవింద్‌ సింగ్‌ (28) గా స్థానిక కూలీలు చెప్తున్నారు. క్షతగాత్రులైన వారిని కోదాడలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.శిధిలాల కింద ఇంకా ఎవరైనా కార్మికులు ఉన్నారేమో అని అనుమానంతో అధికారులు శిదిలాల తొలగింపు చెప్పటారు.అయితే గత కొద్ది కాలంగా బోధన్‌ భూముల్లో మై హోమ్‌ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఎన్నో ఆరోపణలు వెలువడ్డాయి. ఆరోపణల నేపథ్యంలోనే మై హోమ్‌ సంస్థ రూ. 1000 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న యూనిట్‌ నాలుగో ప్లాంట్లో ఈ ప్రమాదం జరగడంతో ఆ సంస్థ చేస్తున్న అక్రమం మరింత బహాయటకు వచ్చింది. ఈ యూనిట్‌ ప్రారంభ మైనప్పటినుంచి ఏదో వివాదం చుట్టుముడుతూనే ఉంది.ఈ ప్రమాదం జరిగిన తర్వాత రెవెన్యూ,పోలీస్‌, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పనులను నిలిపివేశారు. ఆగస్టులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ లపై మై హోమ్‌ యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. కనీస భద్రత ప్రమాణాలు పాటించక పోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెప్తున్నారు. యూనిట్‌ నాలుగు లో జరిగిన ప్రమాదంపై యూపీ, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఘటనా స్థలం వద్ద ఆందోళనకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్డీవో జగదీశ్‌ రెడ్డి,తాసిల్దార్‌ దామోదరావు,స్థానిక పోలీసులు, ఆందోళన చేస్తున్న 500 మంది కార్మికులను బయటికి పంపించారు. మరి కొంత మంది సిబ్బంది ప్రమాద శకలాలను తొలగించారు.
    మై హోమ్‌లో అక్రమ నిర్మాణం పై అధికారుల మౌనం ఎలా.?
    మై హోమ్‌ సంస్థ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణానికి అనుమతుల కొరకు ఇప్పటికే లక్షలు చేతులు మారినట్లు స్థానిక గ్రామాల ప్రజలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు.స్థానిక ప్రజా ప్రతిని ధుల కానుండి మండల, జిల్లా అధికారుల వరకు లక్షల రూపా యలు చేతులు మారినట్లు బహిరంగ ఆరోపణలు వినిపి స్తున్నాయి. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు అందినా కూడా అధికారులు ఉంటూ మై హోమ్‌ సంస్థకు దండగ నిలుస్తున్నారని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఈరోజు ప్రమాదం జరగడంతో రెవెన్యూ, గ్రామ పంచాయతీ,పోలీస్‌ శాఖ అధికారులు పర్యవేక్షణలో మై హోమ్‌ సిమెంట్‌ కంపెనీకికి ఎన్ను దన్నుగా ఉంటూ, ఎవరిని లోపలికి అనుమతించని పరిస్థితి అక్కడ నెలకొంది.
    డిఎస్పీ ప్రకాష్‌ యాదవ్‌ మీడియా సమావేశం..
    సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మై హోమ్‌ సిమెంట్‌ ఇండస్ట్రీస్‌లో జరిగిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయని,ఒకతన్ని హైదరాబాద్‌ యశోద హాస్పిటల్‌ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడిరచారు. క్షతగాత్రులను కోదాడలోని హాస్పిటల్‌లో చికిత్స అందించి దిచ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. సోషల్‌ మీడియాలో, మరికొన్ని డిజిటల్‌ పేపర్లు, ఛానల్లలో ఐదు నుంచి ఎనిమిది మంది చనిపోయారు అనే వార్త లో నిజంలో లేదని, జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు మీడియా సమావేశంలో డిఎస్పి ప్రకాష్‌ యాదవ్‌ తెలిపారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు