Friday, May 3, 2024

పడిపోతున్న పసిడి , వెండి ధరలు

తప్పక చదవండి

భారతీయులకు ఎంతో ఇష్టమైన దంతేరాస్ పండుగ ముంగిట బంగారం ధరలు దిగి వస్తున్నాయి. గురువారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.61 వేల కిందకు దిగి వచ్చింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో రూ.400 తగ్గి రూ.60,50 పలికిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. బుధవారం 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.61,350 వద్ద కొనసాగింది. ‘గురువారం కూడా బంగారం ధరల పతనం కొనసాగింది. ఓవర్సీస్ మార్కెట్లలో బేరిష్ ధోరణితో దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.400 తగ్గుముఖం పట్టి రూ.60,950 వద్ద నిలిచింది` అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. కిలో వెండి సైతం రూ.300 తగ్గి రూ.73,300 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1950 డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.45 డాలర్ల వద్ద ముగిసిందని సౌమిల్ గాంధీ చెప్పారు. ఐఎంఎఫ్‌లో యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం, యూఎస్ మాక్రో డేటాపై ఇన్వెస్టర్లు కేంద్రీకరించారని సౌమిల్ గాంధీ వెల్లడించారు. బంగారం ఫ్యూచర్స్ మార్కెట్లో గిరాకీ తగ్గింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.164 పతనంతో రూ.59,845 వద్ద నిలిచింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.33 శాతం పతనంతో 1,951.30 డాలర్ల వద్ద ముగిసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు