Wednesday, October 9, 2024
spot_img

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

తప్పక చదవండి
  • అక్టోబర్‌ 6 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు
  • అక్టోబర్‌ 28న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు.అక్టోబర్‌ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. అక్టోబర్‌ 28న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్, ఫలితాలు వెలువడనున్నాయి.సింగరేణి సంస్థ పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీం, ఖమ్మం, ఆసిఫాబాద్​, జయశంకర్ ​భూపాలపల్లి జిల్లాలతో పాటు భదాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించి ఉంది. సింగరేణి సంస్థకు మొత్తం 7 జిల్లాలలో 11 డివిజన్లు ఉండగా… ప్రస్తుతం 40 వేల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఇక సింగరేణిలో చివరిసారిగా 2017లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్‌ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం- 9 డివిజన్లలో విజయం సాధించి గుర్తింపు సంఘంగా ఆవిర్భవించింది. 2017 ఎన్నికల సమయంలో కాలపరిమితి నాలుగేళ్లు ఉంటుందని ప్రకటించినప్పటికీ… ఎన్నికైన తరువాత అందించే గెలుపు పత్రంలో మాత్రం రెండేళ్లుగానే పేర్కొన్నారు. నిర్ణీత షెడ్యూల్ ​ప్రకారం గడువు 2019 సెప్టెంబర్‌లోనే ముగిసిపోయింది.

రెండేళ్లు, నాలుగేళ్ల వివాదంపై గుర్తింపు కార్మిక సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఎన్నికల నిర్వహణ వాయిదా పడుతూనే వచ్చాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీన ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేయడానికి ప్రాంతీయ లేబర్ కమిషనర్​తో పాటు కేంద్ర లేబర్​ ఉప కమిషనర్‌ రెడీ అయ్యారు. ఏప్రిల్ 2న షెడ్యూల్​ విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నికలు జరుగుతాయని అంతా భావించారు. ఈ క్రమంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించారు. మార్చి, ఏప్రిల్​ నెలల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఎక్కువగా ఉంటుందని.. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టార్గెట్ రీచ్‌ కాలేమని హైకోర్టుకు వివరించారు. దీంతో ఈ ఏడాది జూన్​ 1వ తేదీ తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గురువారం గుర్తింపు సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు