Wednesday, May 8, 2024

నకిలీ ఏదో….అసలు ఏదో…?

తప్పక చదవండి
  • తూకాలపై ముద్రలు వేస్తామని వ్యాపారస్తులకు టోకరా.?
  • నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు
  • వసూలు చేసిన డబ్బులు 4 నెలలైనా కార్యాలయంలో చెల్లించక పోవడంపై అనుమానాలు

కొత్తూరు : నకిలీ ఏదో..అసిలి ఏదో..చిరు వ్యాపారస్తులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. దుకాణాలలో ఉన్న తుకాలపై ముద్రలు వేసేందుకు వ్యాపారస్తుల వద్ద వందల రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులను తుకాలపై ముద్రలు వేస్తామని లేని పక్షంలో మీకు ఇబ్బందులు తప్పవని బెదిరిస్తు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు.చిరు వ్యాపారులకు అసలు విషయం ఏంటో తెలియక లబోదిబోమంటున్నారు.

  • అసలు విషయానికి వస్తే…
    రాష్ట్ర తూనికలు,ముద్ర శాఖ అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలలోని తుకాలపై ముద్రలు వేసేందుకు కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగులను నియమించి కమిషన్‌ రూపంలో జీతాలు చెల్లిస్తుంటారు. కాంట్రాక్టు ఉద్యోగులు దుకాణాలలోని తుకాలను పరిశీలించి వాటిపై ముద్రలు వేసేందుకు వ్యాపారస్తుల వద్ద కొంత రశీదు రూపంలో డబ్బులు వసూలు చేయాల్సి ఉంటుంది. వేసిని ముద్రలు సంవత్సరం పొడవునా తూనికల శాఖ అధికారుల నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.వ్యాపారస్తుల వద్ద రశీదు రూపంలో తీసుకున్న డబ్బులు వివరాలు కాంట్రాక్టు తూనికల అధికారులు ఆన్లైన్లో అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో అప్లోడ్‌ చేస్తున్నారో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది.అప్లోడ్‌ చేసిన తరువాత తుకాలపై ముద్ర వేయాల్సి ఉంటుంది.
  • అసలు ఏమి జరిగిందంటే..
    కొత్తూరు మండలంలోని పెంజెర్ల గ్రామంలో మంగళవారం కాంట్రాక్టు తూనికల ఉద్యోగులు చిరు వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేసేందుకు వచ్చారు. కానీ ఈ యేడాది మార్చి నెలలో కొందరు వ్యక్తులు వచ్చి వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేశారు.బిత్తరపోయిన పెంజెర్ల వ్యాపారస్తులు ఇంతకు ముందే డబ్బులు చెల్లించామంటు రసీదులు చూపించారు. అ రశీదు విషయం మాకు తెలియదని అసలు ఉద్యోగులము మేము అంటు వచ్చిన ఉద్యోగులు అనడంతో అసలు విషయం తెరపైకి వచ్చింది. వ్యాపారస్తులు డబ్బులు చెల్లించామని వాదానికి దిగడంతో ఈ వివాదం కొత్తూరు పోలీసు స్టేషన్‌ కు చేరుకుంది. కాగా పెంజెర్ల గ్రామంలోని వ్యాపారస్తుల వద్ద జులై నెలలో వసూలు చేయాల్సి వుండగా మార్చి నెలలో వసూలు చేయడం కొసమెరుపు.
  • నకిలీ రశీదుల రూపంలో..
    ఒక వేళ మార్చి నెలలో ఉద్యోగులు చిరు వ్యాపారుల వద్ద నకిలీ రశీదుల రూపంలో డబ్బులు వసూలు చేస్తే ఇది అతి పెద్ద స్కామ్‌ అని చెప్పవచ్చు.. వ్యాపారుల వద్ద వందల రూపాయలు వసూలు చేసి సంబంధిత కార్యాలయంలో జమ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
    లైసెన్స్‌ హోల్డర్‌ శ్రీనివాస్‌ ఏమన్నారంటే..
    పెంజెర్ల వ్యాపారులతో కలిసి పోలీసు స్టేషన్‌ కు వెళ్ళాం.ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వ్యాపారులకు ఇచ్చిన రెండు రసీదులు కరెక్టు అని మార్చి నెలలో వ్యాపారుల వద్ద వసూలు చేసిన డబ్బులు కార్యాలయంలో చెల్లించలేదని తూనికల లైసెన్స్‌ హోల్డర్‌ ఉద్యోగి శ్రీనివాస్‌ ఆదాబ్‌ కు వివరణ ఇచ్చారు.
  • కొత్తూరు ఎసై శంకర్‌ వివరణ..
    లైసెన్స్‌ హోల్దర్‌ కాంట్రాక్టు ఉద్యోగులు ఇచ్చిన రెండు రసీదులు కరెక్టు. వారి ఉన్నత అధికారులతో మాట్లాడాం.మార్చి నెలలో వసూలు చేసిన డబ్బులు కార్యాలయంలో జమ చేయలేదని, వసూలు చేసిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలపడంతో వివాదం సద్దుమణిగిందని వివరణ ఇచ్చారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు