Saturday, July 27, 2024

కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన దాస్యం వినయ్ భాస్కర్..

తప్పక చదవండి

హైదరాబాద్ :
తనపై నమ్మకంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి ప్రకటించడం పట్ల కృతజ్ఞతతో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు బిఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్.. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ కి శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్.. రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా దాస్యం వినయ్ భాస్కర్ ని ప్రకటించడంతో కెసిఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు దాస్యం.. ప్రజా ఆశీర్వాదం, పార్టీ అధ్యక్షులు కెసిఆర్ ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తూ, ప్రజాసేవలో ముందుంటానని, నాలుగు సార్లు తమ ఓటుతో ఆశీర్వదించన నియోజకవర్గ ప్రజలు ఐదోసారి భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రగాఢ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పార్టీ అధ్యక్షులు కెసిఆర్ కి, సహకరించిన కేటీఆర్ కి, అండగా నిలిచిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు