Saturday, September 30, 2023

ఓయూలో మైనంపల్లి దిష్టిబొమ్మ దగ్ధం..

తప్పక చదవండి

హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుపై, మైనంపల్లి హనుమంతరావు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి కాటం శివ, దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో మైనంపల్లి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.. ఈ సందర్భంగా కాటం శివ మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంటనే ఉంటూ.. పార్టీ నిర్మాణంలో.. నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో అహర్నిశలు కష్టపడుతూ కంటిమీద నిద్ర లేకుండా కష్టపడుతూ.. తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని.. నీలాగా ఆంధ్ర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదని, నీలాగా పార్టీలు మారే వ్యక్తి కాదని తీవ్రంగా హెచ్చరించారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎవరికీ టిక్కెట్లు ఇవ్వాలో తెలుసునని, మీ కుటుంబంలో టికెట్ రాలేదని చెప్పి హరీష్ రావుని మాటలు అనడం తగదని, ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేస్తే.. నిన్ను తెలంగాణలో తిరగకపోనివ్వమని హెచ్చరించారు.. చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, మంత్రి హరీష్ రావుకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. లేని పక్షంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా నిరసనలు చేపడతామని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి నాయకులు మూటపోతుల రమేష్ గౌడ్, శీను నాయక్, ప్రవీణ్ చారి, రాజు, దుర్గం వినోద్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు