Saturday, June 15, 2024

మేమంతా హరీశ్‌ వెంటే..

తప్పక చదవండి
  • మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్

హైదరాబాద్‌ :
భారాస నేతలంతా మంత్రి హరీశ్‌రావు వెంట ఉంటామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అంతు చూసేవరకు వదలబోనని తెలంగాణ మంత్రి హరీష్ రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. తామంతా హరీశ్‌రావు వెంట ఉంటామని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్‌రావు పార్టీతో ఉన్నారు. ఆయన భారాస మూలస్తంభంగా కొనసాగుతారని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. హరీశ్‌రావుపై సోమవారం ఉదయం మైనంపల్లి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మెదక్‌లో హరీశ్‌రావు పెత్తనం చేస్తున్నారని, అంతుచూసే వరకు వదలబోనని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో హరీశ్‌రావును అడ్రెస్‌ లేకుండా చేస్తానని మైనంపల్లి మండిపడ్డారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు