Friday, May 3, 2024

యూనిఫాం సివిల్ కోడ్‌ అన్నది సరికాదు..

తప్పక చదవండి

లా కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసిన హుజూరాబాద్ కు చెందిన షేక్ సాబీర్ ఆలీ..

హైదరాబాద్, యూనిఫామ్ సివిల్ కోడ్ ని వ్యతిరేకిస్తూ.. హుజూరాబాద్ కు చెందిన షేక్ సాబిర్ ఆలీ అనే వ్యక్తి లా కమీషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు..భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడేందుకు, భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు తాను వ్యతిరేకం అని తెలిపారు.. మన భారతదేశం వివిధ సంస్కృతులు, మతాలతో కూడి ఉంటుంది.. మన రాజ్యాంగం ఒక వ్యక్తి సంస్కృతి, మతాన్ని పరిరక్షించడానికి, అనుసరించడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదని సూచిస్తుంది.. ఈ వైవిధ్యమైన విశ్వాసాలు, సంస్కృతులు భారతదేశానికి ఆత్మ లాంటివి.. కాబట్టి యూనిఫాం సివిల్ కోడ్ అమలు ఆలోచనను విరమించుకోవాలని.. మన దేశ పౌరుల ప్రాథమిక హక్కులను గౌరవించాలని ఆయన కేంద్ర లా కమిషన్ ని, కేంద్ర ప్రభుత్వాన్ని తన లేఖ ద్వారా అభ్యర్ధించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు