Friday, May 17, 2024

గణేష్‌ బందోబస్తుపై సైబరాబాద్‌ సీపీ సమీక్షాసమావేశం

తప్పక చదవండి
  • 18న పండుగ, సెప్టెంబర్‌ 28న నిమజ్జనం
  • గణేశ్‌ ఉత్సవాలు సజావుగా సాగేలా భారీ బందోబస్తు..
  • ఇన్సిడెంట్‌ ఫ్రీగా, ఘనంగా వేడుకలను జరుపుకోవాలి..
  • గణేష్‌ ఉత్సవాలకు సన్నద్ధమవుదాం
  • సిబ్బందికి సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఐపీఎస్‌ సూచన..

శేరిలింగంపల్లి : ఈ నెల 18వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్‌ 28వ తేదీ వరకు కొనసాగే గణేష్‌ నిమజ్జనానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై ఆదివారం సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఐపీఎస్‌., జాయింట్‌ సీపీ ట్రాఫిక్‌ నారాయణ్‌ నాయక్‌, ఐపీఎస్‌., డిసిపి క్రైమ్స్‌ కల్మేశ్వర్‌ సింగెన్వర్‌, ఐపిఎస్‌., లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీలు ఇతర అధికారులతో కలిసి సైబరాబాద్‌ సీపీ ఆఫీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సైబరాబాద్‌ సీపీ మాట్లాడుతూ. ఇప్పటివరకు జరిగిన అన్ని మతాలకు చెందిన అన్ని పండుగలు, వేడుకలు ఇతర అన్ని కార్యక్రమాలు సాఫీగా జారిగాయన్నారు. ఈసారి గణేష్‌ నిమజ్జనం 28 వ తేదీన మరియు 30 ఏళ్ల తర్వాత ఈద్‌ మిల 28, 29వ తేదీన చంద్రుడు కనిపించే రోజున ఒకే రోజున వచ్చే అవకాశం ఉన్నందున. వేడుకలను కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వేడుకలను ప్రశాంతమైన వాతవరణంలో జరుపుకోవాలన్నారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులకు సీపీ దిశా నిర్దేశం చేశారు. ఈ సంవత్సరంలో జరుపుకొనే అతి పెద్దదైన గణేష్‌ వేడుకలను ‘‘ఇన్సి డెంట్‌ ఫ్రీగా ఘనంగా జరుపుకోవాలని సీపీ అన్నారు. గణేష్‌ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో, ఎన్‌ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్‌ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల్లో సమస్యని రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. గణేష్‌ నిమజ్జనం మొదలుకొని అంతా ముందుగా ప్రణాళిక ప్రకారం జరగాలని ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆయన కోరారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని పౌర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. రానున్న గణేష్‌ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించిన సైబరాబాద్‌ పోలీస్‌ అధికారలు, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్బి, టిఎస్‌ ఎస్‌ పి డి సి ఎల్‌, ఫైర్‌ సర్వీస్‌, ఇరిగేషన్‌, మెడికల్‌ హెల్త్‌ డిపార్ట్మెంట్‌ రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ తదితర శాఖల అధికారులు, భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రతినిధు లతో ఇంటర్‌ డిపార్ట్‌ మెంటల్‌ సమన్వ య సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వీరందరితో కలిసి కలిసి సమన్వయం చేసుకుంటూ శాంతియుతంగా గణేష్‌ నవ రాత్రి ఉత్సవాలను జరుపుకునేలా చూడాలన్నారు. సోషల్‌ మీడి యాలో వచ్చే తప్పుడు వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. సోషల్‌ మీడియా తప్పుడు పోస్టులపై నిఘా ఉంచామని.. చట్ట రిత్యా చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. నిమజ్జనానికి వచ్చే వారితో మర్యా దగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సీపీ సూచించారు. ఇన్‌ స్పెక్టర్లు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలన్నారు. డయల్‌ 100కు వచ్చే కాల్స్‌ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాల న్నారు. సీసీటీవీలపై దృష్టి సారించాలన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించా లన్నారు. మండపాల్లో ఎట్టిపరిస్థితులోను డిజేను ఏర్పాటు చేయ రాదని, నిబంధనలపై మండపం నిర్వహుకులు, కమిటీలకు ఎస్హెచ్‌ఓలు వివరించి చెప్పాలని సూచించారు. గణేష్‌ మండపం లో 24 గంటలు ఒక వాలంటీర్‌ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసు కోవాలని, భక్తుల సందర్శను దృష్టిలో వుంచుకోని మండపాలలో క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలని సూచించారు. మండపాల్లో షార్ట్‌ సర్క్యూట్‌ జరుగకుండా మంచి నాణ్యత గల వైర్లను ఉపయోగిం చేలా చోరవ తీసుకొవాలని, గణేష్‌ మండపాల నిర్వాహకులు, కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్‌ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గణేష్‌ మండపం దగ్గర విధిగా పాయింట్‌ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలని, పోలీస్‌ అధికారుల తనిఖీ వచ్చి నప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారని తెలిపారు. వినాక మండపాల దగ్గర ఎటువంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు వుంటే బందోబస్తు ను పెంచడం చేస్తామన్నారు. పోలీసుధికారులు సందర్శించడంతో పాటు ప్రత్యేక పికెట్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఆయా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వున్న గణేష్‌ విగ్రహాలు, మండపం నిర్వహుకులు కమిటీ వివరాలు, విద్యుత్‌ ప్రమాదాలు, సరఫరాలో అంతరాయం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొవాలని ఆదేశించారు. గణేష్‌ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహి ంచడానికి పటిష్టమైన పోలీసులతో బందోబస్తు, నిమజ్జనోత్స వానికి అవసరమైన పోలీస్‌ బందోబస్తు, స్విమర్స్‌, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్‌, లైటింగ్స్‌, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుపై సంబంధిత శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా నగరంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనరేట్‌ లిమిట్స్‌ లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా జిహెచ్‌ఎంసి అధికారులు ముందుగానే చెరువులు, బేబీ పండ్స్‌ లను సూచించాలన్నారు. వీధి దీపాలు, ఫ్లడ్‌ లైట్లు, అవసరమున్న మేర క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గుంతులుగా ఉన్నరోడ్లను పూడ్చేలా అధి కారులు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం గణేశ్‌ నిమజ్జనం జరిగే చెరువు కట్టల వద్ద టెంట్లు, విద్యుత్‌ లైట్లను, భారీ కేడ్లను నిర్మించాలని, మంచి నీటి సౌకర్యం, మొబైల్‌ టాయి లెట్ల ఏర్పాటు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలన్నారు. ప్రజలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతు పనులు, శానిటైజేషన్‌ పనులను చేపట్టాలన్నారు. గణేష్‌ వేడుకల ను నిర్విఘ్నంగా, ఘనంగా, గౌరవప్రదంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. భద్రతాపరంగా పోలీసులు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సైబరా బాద్‌ సిపి తో పాటు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ నారా యణ నాయక్‌, ఐపీఎస్‌., సైబరాబాద్‌ డిసిపి క్రైమ్స్‌ కల్మేశ్వర్‌ సింగెన్వర్‌, ఐపిఎస్‌., డిసిపి ట్రాఫిక్‌ హర్షవర్ధన్‌, ఐపీఎస్‌., సైబర్‌ క్రైమ్‌ డిసిపి రితిరాజ్‌, ఐపీఎస్‌., లా అండ్‌ ఆర్డర్‌ డిసిపిలు, మాదాపూర్‌ డిసిపి సందీప్‌, శంషాబాద్‌ డిసిపి నారాయణరెడ్డి, ఐపీఎస్‌., రాజేంద్రనగర్‌ డిసిపి జగదీశ్వ ర్‌ రెడ్డి, బాలనగర్‌ డిసిపి శ్రీనివాసరావు, ఐపిఎస్‌., మేడ్చల్‌ డిసిపి శబరీష్‌, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్‌ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు