Sunday, May 19, 2024

అత్యుత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్..

తప్పక చదవండి
  • కొనియాడిన తెలంగాణ చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ డైరెక్టర్,
    బాల్కొండ దర్గా ముఖ్య ఉపాశకులు అబుల్ ఫతే సయ్యద్ భండారీ బాదేశా ఖాద్రీ..

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తెలంగాణా ప్రజలకు అత్యుత్తమ పరిపాలననందించడమే కాకుండా, మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఇతర రాష్ట్రాలన్నిటికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలంగాణా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సభ్యుడు, మాజీ హజ్ కమిటీ సభ్యుడు, తెలంగాణా ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ డైరెక్టర్, బాల్కొండ దర్గా ముఖ్య ఉపాశకులు అయిన అబుల్ ఫతే సయ్యద్ బందగీ బాదెషా ఖాద్రీ ఓ పత్రికా ప్రకటనలో కొనియాడారు.

ఈ సంధర్భంగా, తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమపధకాల్ని, మైనారిటీల జీవితాల్లో అవి తెస్తున్న మార్పుల్ని వివరించారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడక ముందున్న ప్రభుత్వాలు, మైనారిటీ సంక్షేమానికి ఏడాదికి కనీసం రూ. 300కోట్లు కూడా ఖర్చు చేసేవి కాదనీ, కానీ కేసీఆర్ ప్రభుత్వం సుమారు రెండువేల కోట్లను కేటాయించడమే కాకుండా, వివిధ పధకాల ద్వారా పగడ్బందీగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అమ్మాయిల వివాహ ఖర్చులు భరించలేక సతమవుతున్న పేద ముస్లిం కుటుంబాల కష్టాల్ని చూసి చలించిపోయిన కేసీఆర్, అంతకు ముందటి ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ, అప్పటికప్పుడు షాదీ ముబారక్ పధకాన్ని ప్రకటించి, గడచిన తొమ్మిదేళ్ళలో 32713 మంది అమ్మాయిలకు, రూ. 1903కోట్ల రూపాయలు ఖర్చుచేశారని చెప్పారు.
మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా 2022-23 సంవత్సరానికి 270 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందిందని, 2023-24లో మైనారిటీ బంధు పధకం కింద, ఒక్కొక్కరికీ లక్ష రూపాయలవరకూ రుణం అందే ఏర్పాటు చేశారన్నారు. పేద ముస్లిం మహిళలకు మైనారిటీ కార్పోరేషన్ సహకారంతో శిక్షణ ఇప్పించింది 20000 కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. పేద మైనారిటీ కుటుంబాలకు చెందిన విద్యార్ధినీ, విద్యార్థులకోసం 204 గురుకులాలను స్థాపించి, లక్షా ముఫ్ఫైవేల మందికి అత్యత్తమ విద్యను పూర్తిఉచితంగా అందిస్తున్నారని కొనియాడారు. ఒకప్పుడు ప్రభుత్వ హాస్టల్లనగానే దొడ్డుబియ్యం గుర్తుకొచ్చేదనీ, కానీ ప్రస్తుతం సన్న బియ్యంతో పాటు, వారానికి మూడుసార్లు కోడిగుడ్డుతో నాణ్యమైన ఆహారమే కాక, పూర్తి ఇంగ్లీష్ మీడియం చదువులు అందిస్తున్నారనీ, సంక్షేమంలో ఇది ఏ యూరోపియన్ దేశాలకంటే తక్కువకాదనీ ఆయన పేర్కొన్నారు. మైనారిటీ విదేశీ విద్యానిధి పధకం కింద, విదేశాల్లో చదవాలనుకునే మైనారిటీలకు ఏడాదికి 20లక్షల రూపాయలు మంజూరు చేయడం కేసీఆర్ ఉదారతకు నిదర్శనమన్నారు. ఇవే కాకుండా, రంజాన్, క్రిస్మస్ ల సంధర్భంగా కొత్తబట్టలు, విందు సామాగ్రి ప్రతి పేదకుటుంబానికీ అందించి, ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో పండుగ చేసుకునేలా చేయడం చాలా గొప్పవిషయమన్నారు.

- Advertisement -

కేవలం మైనారిటిలకే కాకుండా, రైతుబంధు, రైతు భీమా పధకం, ధాణ్యం సేకరణ, మిషన్ కాకతీయ, హరితహారం, మనఊరు-మనబడి, కంటివెలుగు, బస్తీ దవాఖానాలు, మాతా శిషు ఆరోగ్యం, కేసీఆర్ కిట్, పల్లెప్రగతి, ధరణి, పరిశ్రమల అభివృద్ధి.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పధకంలోనూ కేసీఆర్ దార్శనికత స్పష్టంగా కనిపిస్తుందనీ, తెలంగాణా రాష్ట్రానికి బంగారు బాటవేయడానికి ఈ పధకాలు ఎంతగానో తోడ్పడ్డాయని ఆయన ప్రశంసించారు. అన్నిటికంటే ముఖ్యంగా – శాంతి, సుస్థిరత లేనిదే ఎంత గొప్ప పధకాలు పెట్టినా అభివృద్ధి జరగదనీ, కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలూ లేకుండా, తెలంగాణా ప్రజలందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారనీ, మతకలహాల కారణంగా వివిధ రాష్టాలు రావణకాష్టంలా తగలబడుతున్న ప్రస్తుత తరుణంలో, కేసీఆర్ లాంటి అందరినీ కలుపుకుపోయే ఉదారవాద భావజాలం కలిగిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణా ప్రజల, మరీ ముఖ్యంగా ఇక్కడి మైనారిటీల అదృష్టం అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు