Sunday, May 12, 2024

టెంట్లలో స్టంట్లు కాంగ్రెస్‌… రాష్ట్రంలో బలం లేని బిజెపి

తప్పక చదవండి
  • ప్రజల సంతోషాన్ని కూడా ఓర్వలేని కాంగ్రెస్‌, బిజెపి నాయకులు
  • వీరి వల్ల బిఆర్‌ఎస్‌ ఎటువంటి నష్టం లేదు : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : ప్రజల సంతోషాన్ని కూడా చూసి ఓర్వలేని కాంగ్రెస్‌, బిజెపి నాయకులను ఎలా వర్ణించాలో అర్థ: కావటం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టెంట్లతో స్టంట్లు వేయడమే కాంగ్రెస్‌ పని. తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీకి బరువు లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆ పార్టీలపై మండిపడ్డారు. హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మంత్రి విూడియా సమావేశంలో మట్లాడారు. ఇవాళ రూ.19 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ కోసం కేంద్రంలో కొట్లాడం కాంగ్రెస్‌ చేతకాదు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చేసిందేవిూ లేదని,కాంగ్రెస్‌ పార్టీకి ఏమాత్రం బాధ్యత లేదని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేద్దామని ప్రజలే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ చేసుకున్నారని చెప్పారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి చూసి నేర్చుకుని విూ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీకి మంత్రి సూచించారు. ఒకప్పుడు హుస్నాబాద్‌లో అన్ని గుంతల రోడ్లు ఉండేవి ఇప్పుడు అన్ని సీసీ రోడ్లుగా మారయన్నారు.దాదాపుగా హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని రూ.7752 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. 2500 కోట్ల రూపాయలతో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి రెండు పంటలకు ఢోకా ఉండదన్నారు. నిందలు వేయడంతో పాటు మతతత్వ రెచ్చగొడుతున్న పార్టీ బీజేపీ. వచ్చే ఎన్నికల్లో అబద్ధాల కాంగ్రెస్‌కు అభివృద్ధి సాధించిన బీఆర్‌ఎస్‌ పార్టీ విజయాలకు పోటీ ఉంటుందని పేర్కొన్నారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటైనా అమలు చేసిందా..? చర్చకు నేను సిద్ధమని కాంగ్రెస్‌ పార్టీకి సవాల్‌ విసిరారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసిన కేసీఆర్‌ మూడోసారి సీఎంగా హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం. హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా సతీష్‌ కుమార్‌ మూడోసారి గెలువడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు