Friday, May 17, 2024

మాట తప్పిందా..మడమ తిప్పేసిందా.!

తప్పక చదవండి
  • షర్మిల రాజకీయ ప్రస్థానానికి బ్రేకులు పడ్డాయా…?
  • మడమ తిప్పేది లేదన్న అక్క… అడుగులు తడబడినట్లేనా!
  • షర్మిల మొదలెట్టిన ప్రజా ప్రస్థానం ఆగిపోయిందా…?
  • పాలేరులో పోటీ చేస్తానన్న అధినేత్రి వెనక్కి తగ్గిందా..?
  • తెలంగాణలో వైయస్సార్ టీపీ కనుమరుగేనా…
  • వైయస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా..?

వై.ఎస్. వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. రాజన్న వదిలిన బాణం అంటూ.. ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్న డైనమిక్ మహిళా లీడర్ వై.ఎస్. షర్మిల తన దారి మార్చుకుందా..? ఆమెలో వాడి వేడి తగ్గిందా..? తన రాజకీయ భావితవ్యం కోసం.. స్వతహాగా ఏర్పడ్డ స్వభావాన్ని మార్చుకుంటూ అశేష అభిమానులకు నిరాశను మిగిల్చుతోందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి జరుగుతున్న వాస్తవ పరిస్థితులు..
హైదరాబాద్ పులి కడుపున పఠే పుడుతుంది… వైయస్సార్ బిడ్డ మాటంటే మాటే.. వెనుతిరిగేది లేదు.. మడము తిప్పేది లేదు.. పాలేదు మట్టి సాక్షిగా చెప్తున్న, వైయస్సార్ సంక్షేమ పాలనను గడప గడపకు అందిస్తా అంటూ ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టి తెలంగాణ ప్రజలకు దగ్గరైన స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల, పాలేరు లోనే పోటీ చేస్తానంటూ అక్కడి ప్రజలకు మరింత దగ్గరైంది…. రాష్ట్ర వ్యాప్తంగా అధికారపార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై షర్మిల తనదైన శైళిలో విరుచుకు పడ్డారు… ప్రజాప్రస్థానం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో 3800 కిమీ నడిచి తెలంగాణ ప్రజలకు చేరువయ్యారు… ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో అక్కడి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను కూడా టార్గెట్ చేసి మరీ కడిగి పారేశారు… అయితే ఎంతో నమ్మకంతో రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో తప్పకుండా.. తీసుకవస్తానంటూ శవధంచేసి మరీ వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల ఇప్పుడు కాస్త గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటునట్లు తెలుస్తుంది… అంతే కాకుండా పాలేరులోనే పోటీ చేసి తీరుతా అంటూ ప్రకటించిన వైయస్ షర్మిల ఇప్పుడు తన నిర్ణయాన్ని పూర్తిగా మార్చుకున్నారనే ప్రచారం జరుగుతుంది..

షర్మిల రాజకీయ ప్రస్థానానికి బ్రేకులు పడ్డాయా…?
వైయస్ షర్మిల రాజన్న ముద్దుల తనయగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుపరిచితురాలు. అంతేకాదు తన భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా క్రైస్తవ ప్రభోదకుడిగా ఉన్నారు.. వైయస్సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అంతకు ముందు ప్రతిపక్షనాయకుడిగా ఉన్నప్పుడు షర్మిల తండ్రి చాటు బిడ్డగానే ఉన్నారు. వైయస్ ఆకస్మిక మరణం తరువాత జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్ర, అనంతరం జైలు ఎపిసోడ్ తో షర్మిల రాజకీయాలలోకి అనుకోకుండానే వచ్చారు.. వైయస్సార్ ఆశయాలను, అన్న జగన్ మొండి పట్టును, తండ్రి చనిపోయినప్పుడు ఆగిన గుండెల ఓదార్పు. కోసం షర్మిల ముందుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాదయాత్ర నిర్వహించి తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని మాట ఇచ్చారు… అయితే అనూహ్యంగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండో విడత ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ తిరుగులేని విజయంతో రాజకీయంగా షర్మిల భవిష్యత్ ముందుకు సాగుతున్న క్రమంలో కుటుంబంలో వచ్చిన పొరపొచ్చాలతో ఆమె రాజకీయ ప్రస్థానానికి బ్రేకులు పడ్డాయి…
తెలంగాణ రాజకీయాలలో ఏర్పడిన శూన్యతను పూరిస్తానన్నారు :
జగన్ ప్రభుత్వం ఏర్పాటయిన తరువాత వైయస్ షర్మిల పూర్తిగా తెలంగాణాకే పరిమితమై భర్త అనిల్ తో కలిసి తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని తలంచారు… తెలంగాణలో టిఆరెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుంది. అంటూ, వైయస్సార్ సంక్షేమ పాలనను తెలంగాణలో తెస్తానని ప్రతిజ్ఞ చేసింది… అనుకున్నదే తడవుగా వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారామె…. అంతే కాకుండా షర్మిల మరో ముందడుగు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విధానాలు ఎండగట్టేందుకు ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదంతా ఒక ఎత్తయితే పర్మిల పార్టీ ప్రకటించేందుకు అటు ఆంధ్రా, ఇటు తెలంగాణకు నిశాలమైన పరిహరంగా ఉనం వేణం జిల్లాను ఎంచుకున్నారు మేం పటాణంలోని వేలాది నుండి
సమక్షంలో శంఖారావం పూరించి తెలంగాణ రాజకీయాలలో ఏర్పడిన శూన్యతను పూరిస్తానన్నారు..

- Advertisement -

వైయస్సార్ తెలంగాణ పార్టీని ప్రకటించారు;
అనుకున్నదే తడవుగా 2021 జులై 8న వైయస్సార్ పుట్టిన రోజున షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీని ప్రకటించారు… ఆ తరువాత అక్టోబర్ 21 నుండి తను మెదలెట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలుపుతూ, తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర సాగించారు..
ఇప్పటికే మొత్తం 3800 కిలోమీటర్లు పాదయాత్రను కొనసాగించిన షర్మిల, అధికార టిఆరెస్ తో పాటు, వివిధ పక్షాలపై కూడా వాగ్బాణాలు సంధించారు… అధికార పార్టీ అకృత్యాలతో పాటు, ప్రతిపక్షాల వైఫల్యంపై కూడా షర్మిల కత్తిగట్టారు… ఇలా ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగుతుండగా షర్మిల అనూహ్య ప్రకటన కూడా చేశారు… ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి సమీపంలో జూన్ ఏర్పాటు చేసిన పాదయాత్ర బస శిభిరం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తాను పాలేరు నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. షర్మిల పాలేరులో పోటీ చేస్తాననే ప్రకటనే తరువాయి, ఆమె క్యాంపు కార్యాలయం కోసం స్థలాన్ని కొని మరీ బిల్డింగ్ నిర్మించేందుకు పూనుకున్నారు..
పార్టీ కార్యకలాపాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే :
షర్మిల పార్టీ ప్రకటించిన నాటి నుండి వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యకలాపాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే సాగాయి..
కేవలం షర్మీల ఒక్కరే కత్తి పట్టి యుద్ధం చేశారు.. రాష్ట్రం లోని ఏ ఒక్క నాయకుడు కూడా షర్మిల పార్టీ వైపు చూడలేదు.. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయ్యాక ఇంకా షర్మిల పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.. అక్కడక్కడా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ పాదయాత్రను అడ్డుకోవటం, మహబూబాబాద్ జిల్లాలో ఆమె వాహన శ్రేణిపై దాడి జరగటంతో అర్ధాంతరంగా ప్రజాప్రస్థానం నిలిపి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరువాత ఎక్కడా షర్మిల పార్టీ తెలంగాణలో ప్రజలను ఆకట్టుకున్న స్థితి లేదు…
షర్మిల పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకమైంది :
రాష్ట్రంలో ఏర్పడిన అనూహ్య పరిస్థితులతో షర్మిల పార్టీ భవితవ్యం ప్రశ్నార్ధకమైంది.. ఇటీవలే ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయం ఆవరణలో రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించిన సందర్భంగా కూడా ఆమె త్వరలోనే శవేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేస్తానని ప్రకటించనా. ఆ ఎక్కడా ఏర్పాట్లు సాగటంలేదు..
అంతే కాకుండా పలు సార్లు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలలో ఎక్కడా కూడా షర్మిల పార్టీకి గానీ, పాలేరులో షర్మిలకు గానీ రిపోర్టులు ఆశాజనకంగా లేకపోవటంతో రాజన్న బిడ్డ యూటర్న్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది… తెలంగాణలో బిజేపి బలపడుతుందనే సంకేతాలతో భారతీయ జనతా పార్టీలో వైయస్సార్ టిపిని విలీనం చేస్తారని వార్తలు వచ్చినా, కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ ఫలితాలు, డికే శివకుమార్ మధ్యవర్తిత్వం ద్వారా షర్మిల కాంగ్రెస్ లోనే చేరుతారనే సంకేతాలు బలంగా వస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు