Thursday, May 16, 2024

కాంగ్రెస్ మానిఫోస్టో కసరత్తులు..

తప్పక చదవండి
  • కేసీఆర్ కి ఊహకందని ఎత్తుగడలతో ముందుకు
  • బిసిలు, మహిళలు, పేదలకు దగ్గరగా..
  • ఎస్టీ, ఎస్సీలకు సరికొత్త పథకాలు
  • నిర్భంధాలకు దూరంగా ‘స్వేచ్ఛ’
  • జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసుల ఎత్తివేత

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, ‘ఆదాబ్ హైదరాబాద్’కు ప్రత్యేకం)

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేసీఆర్ ‘ఎత్తుగడలకు ఎలా చెక్ పెట్టవచ్చు’ అనే కోణంలో తీవ్రంగా కసరత్తులు మొదలు పెట్టలేదు… పూర్తి చేయటం విశేషం.

- Advertisement -

అసలు మానిఫోస్టోలో ఏం ఉంది..?:
తెలంగాణలో ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేయటంపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది. ఇందుకోసం మూడు కీలకమైన అంశాలపై దృష్టి సారించింది. అందులో ప్రధానంగా నిర్భంధం, అక్షర, ఆశ్రయ వంటి వాటితో అణగారిన వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇంకా కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువత, మహిళలు, పేదలు వంటి ఆరు అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం చెప్పుకోదగ్గ అంశం.

బిసిలు, మహిళలు, పేదలకు దగ్గరగా..:
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్), గృహలక్ష్మీ (ప్రతి కుటుంబంలోని మహిళకు రూ.2000), ఇందిరమ్మ స్త్రీ (బీపీఎల్ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 10 కిలోల ఆహారధాన్యాలు). శక్తి (మహిళలకు ఉచిత బస్సు రవాణా), బీసీలకు బిసీ కమిషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలు, ఇతర కులాలకు చెందిన పేదలకు కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాల మంజూరు.

ఎస్టీ, ఎస్సీలకు సరికొత్త పథకాలు :
‘దళిత బందు’ ద్వారా జరిగిన అక్రమాలను ఒకవైపు విచారణ చేస్తూ… మరోవైపు దళితులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం, సబ్సిడీలతో వడ్డీలేని రుణాలను పారదర్శకంగా అందించటం. ఇందులో ఎంపీ,ఎమ్మెల్యేల ప్రమేయంం లేకుండా ఆరోపణలు లేని స్థానిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేయటం.

యువకుల కోసం ఇలా…:
యువ నిధి (నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు), నిర్భంధం ఎదుర్కొంటున్న జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల కోసం ప్రత్యేక పథకం ఈ ఆరు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారత, నిరుద్యోగ నిర్మూలన, రైతు సంక్షేమం వంటి అంశాలను చేర్చింది. ఈ కొత్త పథకాలు అదనం.

కేసీఆర్ కు ఊహించని షాక్.! :
ఈ ఎన్నికల మానిఫోస్టోలో కాంగ్రెస్ మొత్తం 108 పథకాలను చేపట్టింది. తెలంగాణలో భారస ఎక్కడ విఫలమయిందో… కాంగ్రెస్ అక్కడ సక్సెస్ మంత్రం చేపట్టింది. విద్య, వైద్య , మహిళా, బిసి, పేద వర్గాలకు చేరువలో ఆ,యా పథకాలను చేపట్టింది. ఇది ‘భారాసకు ఊహించని షాక్’ అని చెప్పవచ్చు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు