Monday, November 4, 2024
spot_img

ఆహారం కోసం అల్లాడుతున్న చెన్నైవాసులు

తప్పక చదవండి

చెన్నై : మిచాంగ్‌ తుఫాను చెన్నైని అతలాకుతలం చేసింది. వరదలు, వర్షాలతో 12 మంది మరణించారు. వర్షం ఆగి 72 గంటలు గడిచినా.. దక్షిణ చెన్నైలోని చాలా వీధులు నీటిలో మునిగి ఉన్నాయి. వేలాది మంది నిత్యావసరాలు లేక, విద్యుత్‌ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో చిక్కుకున్న వృద్ధులు, పిల్లలను రక్షించడానికి పడవలను మోహరించారు. స్థానిక మీడియా గ్రౌండ్‌ రిపోర్ట్‌ పళ్లైకరనై, పెరుంబాక్కం, షోలింగనల్లూర్‌, కరపాక్కం, మేడిపాక్కం, రామ్‌ నగర్‌లతో సహా చెన్నైలోని వెలచ్చేరి ప్రాంతంలోని నివాసితులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. బాధిత ప్రాంతాలు నిత్యావసరాలు, ఆహారం, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలలోకి నీరు పెద్ద ఎత్తున చేరడంతో బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. వరదల కారణంగా తాగునీటి కొరత మరింత తీవ్రం అయ్యింది. సహాయకబృందాలు రెస్క్యూ చేసిన వారు ముందు తమకు ఆహారం ఇవ్వమని అడగడం హృదయవిదారకంగా కనిపించింది. ఈ ఏడాది చెన్నైలో 29 శాతం ఎక్కువ వర్షాలు కురిపించింది. ఈశాన్య రుతుపవనాలకు తోడు మిచాంగ్‌ తుఫాను తోడైందని.. భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ విపత్కర పరిస్థితికి తోడు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో ఆవిన్‌ పాల సరఫరాకు అంతరాయం ఏర్పడిరదని తమిళనాడు మంత్రి మనోజ్‌ తంగరాజ్‌ నివేదించారు. రెండు రోజుల పాటు నగరాన్ని స్తంభింపజేసిన మిచాంగ్‌ తుఫాను కారణంగా కుండపోత వర్షాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో పాటు ఇతర రాష్ట్ర మంత్రులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు