Monday, May 20, 2024

చర్లపల్లి సర్వే నెంబర్ 70 సర్ ప్లస్ సీలింగ్ ల్యాండ్ : ఉప్పల్ సబ్ రిజిస్టర్ సోనీ

తప్పక చదవండి
  • యమ్.ఎన్. ఆదిత్య కుమార్ రిపోర్టులో సర్ ప్లస్ సీలింగ్ ల్యాండ్ గా వెల్లడి..
  • రిక్వెస్ట్ నెంబర్ 526/2016తో ఉప్పల్ సబ్ రిజిస్టర్ కు ఆదేశాలు…
  • రెవెన్యూ శాఖ ఆదేశాలు తుంగలో తొక్కుతూ దొంగ చాటున రిజిస్ట్రేషన్లు..
  • 2018 సంవత్సరం నుండి యదేచ్ఛగా రిజిస్ట్రేషన్స్..
  • రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా నకిలీ ఎల్ఆర్ఎస్..

హైదరాబాద్ :
రెవెన్యూ శాఖ అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ యథేచ్ఛగా చర్లపల్లి సర్వేనెంబర్ 70లోని 6.19 ఎకరాల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్లపల్లి 2016 సంవత్సరంలో రెవెన్యూ పరిధి, ఘట్కేసర్ మండలలోకి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నూతన మండలాలు ఏర్పాటు చేయడంతో.. 2017వ సంవత్సరంలో చర్లపల్లి కాప్రా మండల పరిధిలోకి వెళ్ళింది. ఘట్కేసర్ మండల్ రెవెన్యూ అధికారులు, చర్లపల్లి సర్వే నెంబర్ 70 వ్యవసాయ సర్ ప్లస్ సీలింగ్ ల్యాండ్ గా గెజిట్ రిపోర్ట్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. 2018 సంవత్సరం కాప్రా రెవెన్యూ అధికారుల పూర్తి నిర్లక్ష్యం కారణంగానే, ఉప్పల్ సబ్ రిజిస్టర్ యదేచ్చగా మామూళ్లకు అలవాటు పడి రిజిస్ట్రేషన్లు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్లపల్లి సర్ ప్లస్ సీలింగ్ ల్యాండ్ అక్రమార్కుల చేతిలోకి వెళ్లినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొంత మంది డాక్యుమెంట్ రైటర్ అక్రమ రిజిస్టేషన్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉప్పల్ సబ్ రిజిస్టర్ సోనీ వివరణ :
చర్లపల్లి సర్వేనెంబర్ 70లో 6.19 ఎకరాలు సర్ ప్లస్ సీలింగ్ ల్యాండ్ గా ఘట్కేసర్ మండల్ రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు.. ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ సోనీ వివరణ ఇచ్చారు. 2016 సంవత్సరం నుండి ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు