Wednesday, April 17, 2024

సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2023-24

తప్పక చదవండి

భారత ప్రభుత్వం, కేంద్ర ఉన్నత విద్యా శాఖ.. కాలేజీ, యూనివర్సిటీల విద్యార్థులకు ఆర్థిక చేయూతకు ఉద్దేశించిన ‘సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌’ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా మొత్తం 82,000 మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తారు. వీటిలో 50 శాతం మంది మహిళలకు కేటాయించారు. డిగ్రీ, పీజీ, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ కోర్సులు చేస్తున్న విద్యార్థులు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 31 దరఖాస్తులకు చివరితేది.

అర్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 80 శాతం మార్కులతో ఇంటర్‌/ 12వ తరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఏఐసీటీఈ/ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా/ యూనివర్సిటీ/ గుర్తింపు పొందిన కళాశాలల్లో డిగ్రీ లేదదా పీజీ కోర్సులు అభ్యసిస్తూ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షలకు మించకూడదు.

- Advertisement -

స్కాలర్‌షిప్‌ : ఒక్కో విద్యార్థికి అయిదేళ్ల వరకు ఉపకారవేతనం అందిస్తారు. డిగ్రీ స్థాయిలో మూడేళ్లపాటు ఏటా రూ.12,000; పీజీ స్థాయిలో రెండేళ్లపాటు ఏటా రూ.20,000 చెల్లిస్తారు. బీఈ/ బీటెక్‌ కోర్సుల్లో చేరినవారికి మొదటి మూడేళ్లు ఏటా రూ.12,000.. చివరి ఏడాది రూ.20,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2023
పూర్తివివరాలకు వెబ్‌సైట్‌ : https://scholarships.gov.in/

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు