Saturday, May 18, 2024

ఖైరాతాబాద్ టికెట్ దానంకు దక్కేనా.. ?

తప్పక చదవండి
  • ఆ నియోజకవర్గంలో దానం అంటే గుర్తొచ్చేది కబ్జాలు…
  • ఎంజీఆర్ అంటే గుర్తొచ్చేది సేవా,సంక్షేమ కార్యక్రమాలు
  • ఓ స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో మన్నేంకు అనూకూల ఫలితాలు
  • వీరిలో ఎవ్వరికి బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందో వేచి చూద్దాం..?

హైదరాబాద్ : తెలంగాణ‌లో చురుకైన రాజ‌కీయ నాయకుల్లో దానం నాగేంద‌ర్ ఒక‌రు. ఆయన 2018 తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి కాంగ్రెస్‌ను వీడి, టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని ఖైరాతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు.గెలిచినా నాటినుంచి ఆయన చుట్టూ వివాదాలే చుట్టుముడుతున్నాయి. స్వంత పార్టీ నేతలే ఆయనను వద్దు.. వద్దంటూ దూరం పెడుతున్నారు. దానం అంటే గుర్తొచ్చేది కబ్జాలు, అక్రమాలు,మోసాలు అంటూ ఆయన నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇస్తారో లేదాన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.

హైదరాబాద్ నగరంలో మాస్ లీడర్ గా పేరు సంపాదించుకున్న దానం పీజేఆర్ అనుచరుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టి ఆయన ప్రత్యర్థిగా భావించిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తో చేతులుకలిపి ఆయన క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు.. తరువాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రావడం .. ఆ తరువాత నోటికొచ్చినట్లు తిట్టిన తెరాస నాయకుల పంచన చేరి తన భవిషత్తు కోసం తెరాస లో చేరి ఎమ్మెల్యే కూడా అయ్యారు.ఆ తరువాత మంత్రి కావాలన్న తన కలను తలసాని తన్నుకు పోవడంతో ఆయనపై ద్వేషం పెంచుకున్న దానం ఒకింత ఆందోళనలకు లోనయ్యి బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను దూరం పెట్టి స్వంత కొఠారిని నిర్మించుకున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఖైరాతాబాద్ బీఆర్ఎస్ నాయకులు దానంకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు.. తలసానికి వ్యతిరేకంగా దానం పనిచేశాడని ఆ నోటా ఈ నోటా పడి చివరికి అసలు ముచ్చట అధిష్టానం చెవిలో పడిందట .. ఈ ముచ్చట తెలిసిన పెద్దోళ్ళు ఇక దానం అసలు వ్యవహారంపై ఆరాతీశారట .. దీంతో జాగ్రత్త పడ్డ దానం కాంగ్రెస్ నాయకుల దగ్గరికెళ్లి పైరవీలు షురూ చేశారట .. ఈ ముచ్చట కూడా ఎరుకయిన పెద్దోళ్ళు దానం ను దగ్గరికి తీసేది లేదంటూ పట్టుదలతో ఉన్నారట.. ఈ ముచ్చట నిజమో అబద్దమో రెండు రోజుల్లో తేలిపోతుంది..

- Advertisement -

బీఆర్ఎస్ నాయకులకు దగ్గరయిన మన్నె గోవర్దన్ రెడ్డి
దానం ఆగడాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే మన్నె గోవర్దన్ రెడ్డి వంటి సమర్దుడయిన నాయకుడు రావాలని ఖైరాతాబాద్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు.. ఈ సారి ఎలాగయిన ఆయనకే టికెట్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారట .. ఒక వేళ కేసీఆర్ పాతోళ్లకే టికెట్ ఇస్తామంటూ ప్రకటిస్తే మాత్రం దానంకు ఓటమి తప్పదని నియోజకవర్గ ప్రజలు తెగేసి చెబుతున్నారట .. ఇప్పటికే పలు కార్యక్రమాలతో సంక్షేమ పథకాలతో .. ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజలకు చేరువయిన మన్నేకు పట్టం కడుతామని .. పట్టం కట్టాలని ఖైరాతాబాద్ ఓటర్లు వేచి చూస్తున్నారు..ఇటీవల ఓ స్వచ్చంద సంస్థ యూనివర్సిటీ విద్యార్థులతో నిర్వహించిన సర్వేలో మన్నేంకు అనూకూల ఫలితాలు వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఖైరాతాబాద్ టికెట్ ఫై ఉత్కంఠ నెలకొంది. వీరి ఇద్దరిలో ఎవ్వరికి టికెట్ ఇస్తారో వేచి చుద్ద్దాం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు