Friday, May 10, 2024

బరిలో నిలిచే కాషాయ ధీరులు..?

తప్పక చదవండి
  • అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధినేతలు బిజీ.
  • తెలంగాణలో మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ రెడీ.
  • కీలక నేతలందరూ బరిలోకి షురూ.
  • అవసరమైతే చివరి క్షణంలో మార్పులు.

( పొలిటికల్ కరస్పాండెంట్ వాసు కుమార్)

రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో కీలక నేతలను రంగంలోకి దింపేందుకు కమలం పార్టీ అధినేతలు కుస్తీ పడుతున్నారు. ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కీలక నేతలను రంగంలోకి దింపేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో జరిగిన గుణ పాఠాలను పరిగణలోకి తీసుకొని ఈసారి ముందుగానే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అధినాయకత్వం అభ్యర్థులను ఎంపిక చేసి ప్రచార బరి లోకి దింపింది.. బీ.ఆర్.ఎస్. అధికారికంగా పలుచోట్ల అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేయనప్పటికీ ఆయా పార్టీలో పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే పలువురు నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగి టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు సమాయత్తమవుతున్నారు.. గత రెండు రోజులుగా బిజెపి పార్టీ ప్రకటించిన 40 మంది అభ్యర్థుల లిస్టు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతున్నప్పటికీ అధిష్టానం మాత్రం ఇంకా అభ్యర్థులు ఎంపికపై దృష్టి పెట్టలేదని చెప్పుకొస్తోంది.. అయితే ఇప్పటివరకు ప్రచారలో ఉన్న 40 మంది కీలక నేతలే ఆయా నియోజకవర్గాల్లో రంగంలోకి దిగుతున్నారని స్పష్టం మవుతోంది.. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సైతం గట్టిగా ఢీకొట్టే విధంగా ఆ పార్టీ అధిష్టానం కీలక నేతలను సిద్ధం చేసింది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈసారైనా తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేసి సత్తా చాటాలని రేవంత్ రెడ్డి అండ్ టీం రాష్ట్రంలో విస్తృతంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పోటాపోటీగా అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు, ఆ స్థానాల్లో ఆశలు పెట్టుకున్న మరి కొంతమంది టిఆర్ఎస్ నేతలకు కూడా విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ఐతే తెలంగాణలో విజయఢంకా మోగించి.. దక్షిణ భారతదేశంలో పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలంటే కీలక నేతలందరూ బరిలో దిగాలని మోడీ, అమిత్ షా ద్వయం తేల్చి చెప్పడంతో.. ముఖ్య నేతలు సైతం రంగంలోకి దిగేందుకు సంసిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో బిజెపి నేతలందరూ ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి బిజెపి పార్టీ విజయాలు ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా నిరంతరం ప్రజల్లో ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఆ పార్టీ విడుదల చేసిన జాబితాలో క్షేత్రస్థాయి నుండి ఫిర్యాదులు వస్తే చివరి నిమిషంలో కూడా మార్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అభ్యర్థుల ప్రకటన విషయంలో సంఘ పరివార క్షేత్రాలు సైతం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నాయి. దీంతో ఇప్పుడు ప్రకటించిన జాబితాలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ కొత్త ట్రెండ్ తో ఎన్నికల కంటే ముందే జాబితాను విడుదల చేసి అభ్యర్థులను పరుగులు పెట్టిస్తోంది..

అభ్యర్థుల వివరాలు :
కిషన్ రెడ్డి – అంబర్ పేట్.. కే. లక్ష్మణ్ – ముషీరాబాద్.. బండి సంజయ్ – కరీంనగర్.. సోయం బాపూరావు – బోధ్.. ధర్మపురి అరవింద్ – ఆర్మూర్.. ఈటల రాజేందర్ – గజ్వేల్.. రఘునందన్ రావు – దుబ్బాక.. డీకే అరుణ – గద్వాల.. జితేందర్ రెడ్డి – మహబూబ్ నగర్ లేదా నారాయణ్ పేట్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – మునుగోడు.. మురళీధర్ రావు – వేములవాడ లేదా కూకట్ పల్లి.. ఎన్. ఇంద్రసేనా రెడ్డి – ఎల్బీ నగర్.. వివేక్ – చెన్నూరు.. విజయశాంతి – మెదక్.. యెండల లక్ష్మి నారాయణ – నిజామాబాద్ అర్బన్.. రామచంద్ర రావు – మల్కాజ్ గిరి.. ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ – ఉప్పల్.. ఆచారి – కల్వకుర్తి.. జయసుధ – సికింద్రాబాద్.. మహేశ్వర్ రెడ్డి – నిర్మల్
రాథోడ్ రమేష్ – ఆసిఫాబాద్.. పొంగులేటి సుధాకర్ రెడ్డి – ఖమ్మం.. బాబు మోహన్ – ఆందోల్.. నందీశ్వర్ గౌడ్ – పటాన్ చెరు.. కూన శ్రీశైలం గౌడ్ – కుత్బుల్లాపూర్, బూర నర్సయ్య గౌడ్ – భువనగిరి లేదా ఇబ్రహీంపట్నం.. విశ్వేశ్వర్ రెడ్డి – తాండూర్.. గరికపాటి మోహనరావు – వరంగల్.. ఈటల జమున – హుజురాబాద్.. విక్రమ్ గౌడ్ – గోషామహల్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు