Friday, May 3, 2024

భూదాన్‌ పోచంపల్లికి నకిలీల బెడద

తప్పక చదవండి
  • ఇక్కత్‌ ప్రింటెడ్‌ చీరల అమ్మకం
  • నకిలీలపై ఫిర్యాదుతో విజిలెన్స్‌ దాడులు

భూదాన్‌పోచంపల్లి : భూదాన్‌ పోచంపల్లి ఇక్కత్‌ చీరలకు నకిలీచెద పట్టింది. ఇక్కడి షాపుల్లో చీరలు అంటే నమ్మకంగా కొనుగోలు చేస్తారన్న బరోసాతో కొందరు సూరత్‌ నకిలీ ఇక్కత్‌ ప్రింటెడ్‌ చీరులు అమ్ముతున్నారు. భూదాన్‌ పోచంపల్లి మున్సిపల్‌ కేంద్రంలో కొన్ని షాపులు నకిలీ ఇక్కత్‌ చీరలు, నకిలీ ప్రింటెడ్‌ చీరలను విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో విజిలెన్స్‌ అధికారులు మంగళవారం నాడు తనిఖీలు చేపట్టారు. హ్యాండ్లూమ్‌ షాపుల నుంచి నకిలీ ప్రింట్‌ ఉన్న చీరలను స్వాధీనం చేసుకున్నారు. ఆ షాపు యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఆ చీరలను పరిశీలించి చూస్తే తప్ప నకిలీవి అని తెలియదు. అచ్చం సూరత్‌ నుంచి తీసుకొచ్చిన చీరల మాదిరిగా కనిపించాయి. ఇక్కత్‌ చీరలు అంటే భూదాన్‌ పోచంపల్లి పెట్టింది పేరు. ఆ చీరలు ఇక్కడే పుట్టాయని చెబుతుంటారు. చీరలకు రంగులు వేసే సంప్రదాయ పద్ధతిని ఇక్కత్‌ అని పిలుస్తారు. చీరకు ఎక్కడ రంగు వేయాలో ఊహించుకొని అక్కడ వేస్తారు. ఈ పద్ధతిని రెసిస్ట్‌ డైయింట్‌ అంటారు. దారాలకు రంగులేసి, డిజైన్లను వేస్తారు. పురాతన పద్దతుల్లో రెసిస్ట్‌ డైయింగ్‌ ఒకటి. పోచంపల్లి ఇక్కత్‌ చీరలు 1800 కాలంలోనే మంచి పేరు గడిరచాయి. పోచంపల్లిలో దాదాపు 10 వేల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల జీవన ఆధారం చీరల నేయడమే. ఇక్కత్‌ను ఒక చీరల్లో కాదు సల్వార్లు, స్కర్ట్‌, అనార్కలీ, లెహంగాల్లో కూడా ఉపయోగిస్తారు. చీరల ప్రామాణికతను నిర్దారించే జియగ్రాఫికల్‌ ఇండికేటర్‌ 2005లో పోచంపల్లికి లభించింది. పోచంపల్లి చీరలను సెలబ్రిటీలు ధరించారు. ఐశ్వర్యరాయ్‌ తన పెళ్లి, రిసెప్షన్‌లో పోచంపల్లి చీర కట్టుకున్నారు. అయితే ఇక్కత్‌కు కొందరు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. భూదాన్‌ పోచంపల్లిలో గల షాపుల్లో కొందరు నకిలీ చీరలను విక్రయిస్తున్నారు. ఇతర చోట్ల నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి జనాలను మోసం చేస్తున్నారు. వారిని బురిడి కొట్టించి మోసం చేస్తున్నారు. విజిలెన్స్‌ అధికారుల సోదాలతో కొన్ని షాపు నిర్వాహకులు చేస్తోన్న మోసం బట్టబయలైంది. భూదాన్‌ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో వస్త్ర దుఖానాల్లో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్‌మెంట్స్‌ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇక్కత్‌ వస్త్రాలను పోలిన డూప్లికేట్‌ చీరలను అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారంతో 15 మంది బృందంతో వస్త్ర దుఖానాల్లో తనిఖీలు చేపట్టారు. షాపుల్లో ప్రస్తుతం ఉన్న స్టాక్‌, బిల్లులను వారు పరిశీలించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఇక్కత్‌ చీరలకు బదులుగా సూరత్‌ నుంచి ప్రింటింగ్‌ చీరలు తీసుకొచ్చి ఇక్కత్‌ చీరెలు పేరుతో విక్రయిస్తున్నారనే సమాచారంతో ఉన్నతాధికారుల సూచన మేరకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు