Saturday, July 27, 2024

ఉద్యమకారులారా బహుపరాక్..

తప్పక చదవండి
  • కేసీఆర్ చేతిలో మళ్లీ పోకండి..
  • రాష్ట్రంలో రాక్షస పాలన కొనపాగుతోంది..
  • ఉద్యమాలు చేసే వాళ్లను పోలీసులతో అణిచేస్తున్నరు..
  • అతి త్వరలో బీజేపీ అభ్యర్థుల ప్రకటన..
  • నేనెక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది..
    బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్..

కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను ఎన్నడో మర్చిపోయారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ చుట్టు ఉన్న వాళ్లంతా తెలంగాణ ఉద్యమ ద్రోహులేనని చెప్పారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. ఎన్నికలొస్తుండటంతో ఉద్యమకారులను దువ్వే పనిలో పడ్డారని… మరోసారి కేసీఆర్ చేతిలో మోసపోవద్దని సూచించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను అతి త్వరలోనే పార్టీ ప్రకటిస్తుందని చెప్పారు. ఆదివారం మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ లో తెలంగాణ ఉద్యమకారులు బండి సంజయ్ ను కలిశారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న, సొల్లు అజయ్ వర్మ, గడ్డం నాగరాజుతో కలిసి తిమ్మపూర్ లోని రామక్రిష్ణ నగర్ కాలనీలో రూ.9 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. చిన్నారులతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా స్థానికులు డోలు వాయిద్యాలతో సంజయ్ కు స్వాగతం పలికారు. వారితో కలిసి బండి సంజయ్ డప్పు కొట్టారు.అంతకు ముందు విలేకర్లతో మాట్లాడుతూ..

- Advertisement -

సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను, అమరులను ఎప్పుడో మర్చిపోయిండు. అధికారం కోసం, అవసరమైనప్పుడు మాత్రమే అమరవీరులకు జోహార్లు అంటడు. ఆ తరువాత వాళ్ల ఊసెత్తడు. ఉద్యమకారులవల్ల తెలంగాణ వస్తే అధికారం అనుభవిస్తున్న కేసీఆర్… టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసి తెలంగాణ పదాన్ని తొలగించేసిండు. మహారాష్ట్రపోయి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేధన్నారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువైంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐం పార్టీని సంకనేసుకున్నడు. కేసీఆర్ లెఫ్ట్, రైట్ ఉన్నోళ్లంతా ఉద్యమద్రోహులే. తెలంగాణలో ప్రజల పాలన వస్తుందనుకుంటే కేసీఆర్ కుటుంబపాలనతో దివాళా తీయించిండని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కేసీఆర్ కుటుంబానికే తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదని విమర్శించారు.

కేసీఆర్, హరీష్ రావు ఏ ప్రాంతానికి పోయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో మీ కాళ్లు కడుగుతామని చెబుతున్నారు. కానీ ఆ నీళ్లన్నీ ఫాంహౌజ్ కే పోతున్నయ్. కాళేశ్వరంతో రాష్ట్రంలో ఎంతమంది కాళ్లు తడిపారో, ఎన్ని ఎకరాలను నీళ్లిచ్చారో చెప్పాలి. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నరు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులుసహా అన్ని వర్గాలు కేసీఆర్ పాలనపై విసిగి రోడ్డెక్కుతున్నరు. వాళ్ళను భయపెట్టేందుకు పోలీసులను ఉపయోగించుకుని అరెస్టులు చేయిస్తూ లాఠీఛార్జ్ చేయిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నరు. ఓట్లేయకుండా మీ సంగతి చూస్తామని బెదిరించే స్థితికి వచ్చారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. ఉద్యమకారులారా.. ఎన్నికలొస్తున్నయ్. ఈసారి కేసీఆర్ చేతిలో మోసపోవద్దు. అలర్ట్ గా ఉంటూ ప్రజల్లోకి వెళ్లండని సూచించారు.బీజేపీ తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను అతి త్వరలోనే బీజేపీ ప్రకటిస్తుంది. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటుంది. మాది కేసీఆర్ లెక్క ఏక్ నిరంజన్ పార్టీ కాదు. నేను అసెంబ్లీకి పోటీ చేయాలా? పార్లమెంట్ కు పోటీ చేయాలా? ఎక్కడ పోటీ చేయాలి? అనే విషయంపై హైకమాండ్ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయమే శిరోధార్యం. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ చేస్తారా? లేదా? అంశాన్ని సీబీఐ, ఈడీ సంస్థలు చూసుకుంటాయి. అవి స్వతంత్ర్య సంస్థలు. దొరికిన ఆధారాలను బట్టి చర్యలుంటాయి. అందులో జోక్యం చేసుకోబోం. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ విధానాలు నచ్చి పార్టీలోకి వచ్చే వాళ్లను చేర్చుకుంటాం. మానకొండూరు సహా తెలంగాణలో మోదీని బూతులు తిట్టినోళ్లను, బీజేపీని బదనాం చేసినోళ్లను పార్టీలోకి రానీయబొమన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు