Saturday, May 18, 2024

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకే ఇవ్వాలి..

తప్పక చదవండి
  • జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
  • అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి
  • రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు పొలిటికల్ గా సరైన ప్రాధాన్యత దక్కడం లేదు
  • బీసీలకే పెద్ద పీట అంటూ చెప్పుకొచ్చిన పార్టీలు.. బీసీలకు మొండి చేయి

హైదరాబాద్ : రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలంగాణలోని పొలిటికల్ పార్టీలకు సూచించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు పొలిటికల్ గా సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. వచ్చే ఎన్నికల్లో అయినా బీసీలకు సీట్లు ఇవ్వడంపై పార్టీలు ఆలోచించాలి. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీట అంటూ చెప్పుకొచ్చిన పలు పార్టీలు.. ఎన్నికలు రాగానే బీసీలకు సీట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపించాయి. ఈ ఎన్నికల్లో మాత్రం అలాంటి జరగకూడదని దుండ్ర కుమారస్వామి చెప్పుకొచ్చారు.

మేమెంతో.. మాకంత :
బీసీలకు రాజ్యాధికారం దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీలను ఎప్పుడూ పల్లకీ మోయడానికే ఉపయోగించే పార్టీలు ఇకనైనా ఆలోచించాలి. బీసీలు ఎంత మంది ఉన్నారో.. అందుకు తగ్గట్టుగా మాకు సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. జనాభా దామాషా ప్రకారం బీసీలము ఎంత ఉన్నామో ఆ స్థాయిలో ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని ప్రతి ఒక్క పార్టీని కోరుతున్నామని దుండ్ర కుమారస్వామి అన్నారు. అలా కాదని మాకు మరోసారి వెన్నుపోటు పొడవాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కుమారస్వామి హెచ్చరించారు.

- Advertisement -

అన్ని పార్టీల అధ్యక్షులను కలుస్తాం:
బీసీలకు వచ్చే ఎన్నికల్లో సరైన ప్రాధాన్యత దక్కేలా అన్ని పార్టీలను కలుస్తామని దుండ్ర కుమారస్వామి తెలిపారు. పార్టీల పెద్దలకు కావలసిన రెప్రజెంటేషన్ ను తానే స్వయంగా ఇస్తానని దుండ్ర కుమారస్వామి తెలిపారు. బీసీలకు అండగా నిలిచిన పార్టీకే ప్రజలు పట్టం కడతారని.. ఆ విషయాన్ని ఇకనైనా పార్టీల నాయకులు ఆలోచించాలని అన్నారు దుండ్ర కుమారస్వామి. బీసీలకు 50 శాతం సీట్లు ఇచ్చేలా ప్రతి పార్టీని మేము కోరుకుంటున్నామని.. అదే జరగగకపోతే ప్రజాగ్రహం తప్పదని కుమారస్వామి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాబాయాదవ్, ప్రవీణ్ , భవాని శంకర్, రమేష్ సిద్ధిక్ సాయి మల్లేష్ వెంకట్ పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు